Megastar Chiranjeevi: చిరు 156 టైటిల్ రిలీజ్ ! టైటిల్ కాన్సెప్ట్ వీడియో షేర్‌ చేసిన చిత్ర యూనిట్ !

చిరు 156 టైటిల్ రిలీజ్ ! టైటిల్ కాన్సెప్ట్ వీడియో షేర్‌ చేసిన చిత్ర యూనిట్ !

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగా 156 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న సినిమా పేరును సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. మెగాస్టార్-వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే పేరును ఖరారు చేయడంతో పాటు సంక్రాంతి సందర్భంగా ఆ టైటిల్ కాన్సెప్ట్‌ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ కాన్సెప్ట్ వీడియో విషయానికి వస్తే… రగ్భీ ఆకారంలో ఉండే ఒక వస్తువు పలు లోకాలు తిరుగుతూ చివరికి దాని నుండి సినిమా టైటిల్ ఉద్భవిస్తుంది.

అంతేకాదు 2025 సంక్రాంతికి కలుద్ధాం అంటూ టైటిల్ లుక్ లోనే రిలీజ్ డేట్ ను కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ‘విశ్వంభర’ టైటిల్ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గతేడాది దసరా రోజున ‘విశ్వానికి మించి..’ అనే ఆసక్తికరమైన పోస్టర్‌ ను విడుదల చేసిన చిత్ర యూనిట్…. తాజాగా సంక్రాంతి సందర్భంగా టైటిల్‌ను ప్రకటించారు. దీనితో ఈ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి.

Megastar Chiranjeevi Movie Updates

టైటిల్ కాన్సెప్ట్ వీడియో బట్టి చూస్తే ఇదో సోషియో ఫాంటసీ మూవీ అని స్పష్టంగా అర్థమవుతోంది. ‘బింబిసార’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం… దాదాపు మూడు దశాబ్దాల తరువాత మెగా స్టార్‌ హీరోగా సోషియో పాంటసీ జోనర్ లో సినిమా తెరకెక్కుతుండడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ… ‘మెగాస్టార్‌(Megastar Chiranjeevi) స్వచ్ఛమైన ఫాంటసీ జోనర్‌ చిత్రంలో నటించి మూడు దశాబ్దాలు అవుతోంది. ఈ సినిమా కోసం సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి.కి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు’ అంటూ దర్శకుడు వశిష్ఠ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను పెంచేసాయి.

యూవీ క్రియోషన్స్ బ్యానర్ పై ‘బింబిసార’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మారేడుమిల్లిలో జరుగుతోంది. వాల్తేర్ వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత… భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూసారు మెగాస్టార్ చిరంజీవి. కాబట్టి హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ‘విశ్వంభర’ పై మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

Also Read : Hrithik Fighter : ‘ఫైటర్’ ట్రైలర్ తో ఫ్యాన్స్ ను ఉర్రుతలూగిస్తున్న హ్రితిక్ రోషన్

Megastar ChiranjeeviViswambhara
Comments (0)
Add Comment