Chiranjeevi : హైదరాబాద్ – మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్ లోని లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెగా ఫ్యామిలీ అంతా ఆస్పత్రికి చేరుకున్నారు. తన తల్లి అనారోగ్యానికి గురైనట్లు తెలిసిన వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల హుటా హుటిన హైదరాబాద్ కు మంగళగిరి నుంచి బయలుదేరి విచ్చేశారు. ఆయనతో పాటు నాగబాబు కొణిదల కూడా ఉన్నారు.
Chiranjeevi Mother Health Updates
మరో వైపు బుచ్చిబాబు సన దర్శకత్వంలో నటిస్తున్న రామ్ చరణ్ తేజ ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తన నాయినమ్మ ఆస్పత్రిలో చేరిందని తెలుసుకున్న వెంటనే తను కూడా బెంగళూరు నుంచి బయలుదేరారు.
ఇదిలా ఉండగా అంజనాదేవి ఇటీవలే ఘనంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇదే సమయంలో ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా మెగాస్టార్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇది వైరల్ గా మారింది.
కాగా అంజనాదేవి ఆరోగ్యానికి సంబంధించి ఇంకా వివరాలు వెల్లడించలేదు ఆస్పత్రి వర్గాలు కానీ ఇంకా ధ్రువీకరించలేదు.
Also Read : Swetha Basu Shocking Comment :ఆ హీరో వేధింపులు తట్టుకోలేక పోయా