Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ గురించి స్పందించారు. ఎక్స్ వేదికగా తన బాధను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. సినిమా అనేది ప్రతి ఒక్కరికీ ఛాలెంజింగ్ గానే ఉంటుందన్నారు. తాను కూడా ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు చిరంజీవి.
Chiranjeevi Comments on SS Thaman
ప్రతి విజయం వెనుక ఎన్నో ఇక్కట్లు ఉంటాయని తెలుసుకుంటే మంచిదన్నారు చిరంజీవి(Chiranjeevi). థమన్..నీలో ఇంతటి వేదన ఉందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నాడు. నీ ఎమోషన్స్ ను తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.
బాబీ దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలయ్య , ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ కలిసి నటించిన డాకు మహారాజ్ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించి విజయంలో కీలక పాత్ర పోషించిన థమన్ సక్సెస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్ని కోట్లు కుమ్మరించినా అది రాదన్నాడు. దాని వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుందన్నాడు.
సినిమా అందించిన సక్సెస్ కిక్కు గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నాడు థమన్. దీనిపై స్పందించిన మెగాస్టార్ నిజంగా నువ్వు గ్రేట్ థమన్ అంటూ కితాబు ఇచ్చారు.
Also Read : Beauty Urvashi Rautela : సైఫ్ అలీ ఖాన్ కు రౌటేలా క్షమాపణ