Megastar Chiranjeevi: కేరళ సీఎంకు స్వయంగా చెక్ అందజేసిన మెగాస్టార్ చిరంజీవి !

కేరళ సీఎంకు స్వయంగా చెక్ అందజేసిన మెగాస్టార్ చిరంజీవి !

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి … కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ను కలిశారు. త్రివేండ్రం వెళ్లిన మెగాస్టార్‌ కేరళ సీఎం పినరయి విజయన్‌ను కలిసి తన వంతు బాధ్యతగా రూ. కోటి చెక్కును స్వయంగా అందించారు. ఈ సందర్భంగా వయనాడ్ ఘటనపై చిరంజీవి(Megastar Chiranjeevi) ఆరా తీశారు. బాధితులకు అందిస్తోన్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. కాసేపు ఇద్దరూ పలు అంశాలపై మాట్లాడుకొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ గా మారాయి.

Megastar Chiranjeevi Handover

భారీ వర్షాలు కేరళలోని వయనాడ్‌లో విషాదాన్ని నింపాయి. కొండచరియలు విరిగిపడడంతో వందల మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకొచ్చారు. కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు… తన కుమారుడు రామ్‌ చరణ్‌ తో కలిసి చిరంజీవి రూ. కోటి విరాళాన్ని ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు సీఎంను గురువారం నేరుగా కలిసిన చిరంజీవి చెక్కు అందించారు. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, సూర్య, నయనతార, మోహన్‌లాల్‌, కమల్‌ హాసన్‌, విక్రమ్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రష్మిక తదితరులు సైతం వయనాడ్‌ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించారు.

ప్రస్తుతం మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్‌ లో సోషయో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి(Megastar Chiranjeevi) సరసన త్రిష కనిపించనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

టాలీవుడ్ నుంచి వయనాడ్‌ లో ప్రకృతి సృష్టించిన బీభత్సం నిమిత్తం ఎందరో సెలబ్రిటీలు విరాళం ప్రకటించి తమ గొప్ప మనసును చాటుకున్నారు. వారిలో కోటి రూపాయలు CM రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రకటించారు.

వయనాడ్‌ బాధితులకు సినీ ప్రముఖులు ఇచ్చిన విరాళాలు !

 

మోహన్ లాల్- రూ.3 కోట్లు

ప్రభాస్- రూ. 2 కోట్లు

చిరంజీవి, రామ్ చరణ్- 1 కోటి

సూర్య, జ్యోతిక దంపతులు- రూ.50 లక్షలు

మమ్ముట్టి, దుల్కర్- రూ.40 లక్షలు

కమల్ హాసన్- రూ.25 లక్షలు

అల్లు అర్జున్- 25 లక్షలు

ఫహాద్ ఫాజిల్- రూ.25 లక్షలు

విక్రమ్- రూ.20 లక్షలు

రష్మిక- రూ.10 లక్షలు

సితార ఎంటర్‌టైన్‌మెంట్ వంశీ- రూ. 5 లక్షలు

Also Read : Turbo: ముందుగానే ఓటీటీలోకి వ‌చ్చేసిన మ‌మ్ముట్టి ‘టర్బో’ !

Global Star Ram CharanMegastar ChiranjeeviPinarayi VijayanWayanad Landslide
Comments (0)
Add Comment