Megastar Chiranjeevi: ‘విశ్వంభర’ కోసం మెగాస్టార్ జిమ్ వర్కౌట్స్ !

'విశ్వంభర' కోసం మెగాస్టార్ జిమ్ వర్కౌట్స్ !

Megastar Chiranjeevi: మెగాస్టార్ అనేది ఊరికే వచ్చే బిరుదు కాదు… అరువు తెచ్చుకునే ట్యాగ్ లైన్ అంతకన్నా కాదు. మెగాస్టార్ అంటే కష్టం, శ్రమ, క్రమశిక్షణ, నిబద్దత, కృషి, పట్టుదల ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఒక్కటిగా చూడాలంటే మెగాస్టార్ చిరంజీవిని చూడాల్సిందే అని మరోసారి నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. 68 ఏళ్ల వయసులో కూడా తన సినిమా కోసం జిమ్ లో మెగాస్టార్(Megastar) చేస్తున్న వర్కౌట్స్ చూస్తుంటే… యువ హీరోలు సైతం సిగ్గుపడాల్సిందే. ఈ డెడికేషన్ వల్లనే కదా ఆయన మెగాస్టార్ అయ్యింది అని అనిపించక మానదు. బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సోషియోఫాంటసీ సినిమా ‘విశ్వంభర’.

Megastar Chiranjeevi Movie Updates

చిరు కెరీర్ లో అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ జానర్ లో పూర్తిస్థాయి ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో… బియాండ్ ద యూనివర్స్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. దీనితో ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. దీనితో ఆ హైప్ కు తగ్గట్టుగా మెగాస్టార్ చిరంజీవి(Megastar) ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘విశ్వంభర’ కోసం ప్రత్యేకంగా జిమ్ వర్కౌట్స్ చేస్తూ న్యూ లుక్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ వీడియో రూపంలో చిరంజీవి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

68 ఏళ్ల వయసులో కూడా సినిమా కోసం జిమ్ కి వెళ్లి కసరత్తులు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి… తన సోషల్ మీడియా అకౌంట్స్ లో జిమ్ లో ఎక్సర్సైజులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసారు. అంతేకాదు విశ్వంభర కోసం రెడీ అవుతున్నట్లు చెప్పాడు. మామూలుగానే ఫిట్ గా ఉండే మెగాస్టార్(Megastar Chiranjeevi)… ‘విశ్వంభర’ కోసం మరింత ఫిట్ గా సాలిడ్ ఫిజిక్ ను తయారు చేస్తున్నాడు. ఈ వయసులో మెగాస్టార్ ఇంత డెడికేట్ గా జిమ్ లో కష్టపడుతుండడం మెగా ఫ్యాన్స్ కి మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. దీనితో చిరు నుంచి వచ్చిన ఈ సర్ప్రైజింగ్ వీడియో చూసి మాత్రం అంతా వావ్ అంటున్నారు. ఇక ఈ వీడియోతోనే విశ్వంభర కోసం తాను సిద్ధం అంటూ సాలిడ్ అప్డేట్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. దీనితో చిరంజీవి జిమ్ వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

యూవీ క్రియోషన్స్ బ్యానర్ పై ‘బింబిసార’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మారేడుమిల్లిలో జరుగుతోంది. వాల్తేర్ వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత… భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూసారు మెగాస్టార్ చిరంజీవి. కాబట్టి హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ‘విశ్వంభర’ పై మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభంకావడంతో… జెట్ స్పీడ్ లో జరుపుకోని 2025 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read : Srimantudu Movie: శ్రీమంతుడు వివాదంపై ఎట్టకేలకు స్పందించిన చిత్ర యూనిట్ !

Megastar ChiranjeeviViswambhara
Comments (0)
Add Comment