Megastar Chiranjeevi: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రికు మెగాస్టార్‌ చిరంజీవి సన్మానం !

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రికు మెగాస్టార్‌ చిరంజీవి సన్మానం !

Megastar Chiranjeevi: ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా జనసేన నేత, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్‌ ను మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించారు. ‘విశ్వంభర’ సెట్స్‌కు ఆహ్వానించిన అయన మంత్రికి ఘన స్వాగతం పలికి దుస్సాలువాతో సత్కరించారు. మంత్రిగా తన బాధ్యతలని నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్థి చేస్తారని విశ్వసిస్తున్నాను అని చిరంజీవి అన్నారు. తెలుగు చలన చిత్ర అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని దుర్గేష్‌ చెప్పారు.

Megastar Chiranjeevi…

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి నిడదవోలు ఎమ్మేల్యేగా భారీ మెజారిటీ గెలుపొందిన దుర్గేష్‌ మంత్రి పదవిని దక్కించుకున్నారు. కందుల దుర్గేష్‌ చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవితో పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సెట్‌లో బిజీగా ఉన్నారు. విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

Also Read : Sravanthi Chokarapu: తాను పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అంటున్న బుల్లితెర భామ స్రవంతి చొక్కరపు !

AP MinisterKandula DurgeshMegastar Chiranjeevi
Comments (0)
Add Comment