Megastar Chiranjeevi: పారిస్ సమ్మర్ ఒలింపిక్స్‌ వీక్షణకు మెగా ఫ్యామిలీ పయనం !

పారిస్ సమ్మర్ ఒలింపిక్స్‌ వీక్షణకు మెగా ఫ్యామిలీ పయనం !

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా పారిస్ సమ్మర్ ఒలింపిక్స్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పయనమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అతని భార్య సురేఖ, కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, చరణ్ భార్య ఉపాసనతో పాటు వారి గారాల పట్టి క్లీంకారాతో కలిసి సమ్మర్ ఒలింపిక్స్ కు బయలుదేరారు. గురువారం పారిస్‌ చేరుకోనున్న మెగా ఫ్యామిలీ ప్రస్తుతం లండన్‌లోని ‘హైడ్‌ పార్క్‌’ లో ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా లండన్ లోని హైడ్ పార్క్ లో కుటుంబ సమేతంగా ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. పారిస్ వెళ్లే మార్గంలో లండన్‌ లో ఫ్యామిలీతో ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నానని మెగాస్టార్ ట్విట్‌లో పేర్కొన్నారు.

Megastar Chiranjeevi Family Tour

‘‘రేపు పారిస్‌కు వెళ్లే మార్గమధ్యంలో.. లండన్‌లోని హైడ్ పార్క్‌ లో ఫ్యామిలీ మరియు గ్రాండ్ లిటిల్ వన్ క్లీంకారతో ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నాను. సమ్మర్ ఒలింపిక్స్ 24 ప్రారంభ వేడుక పిలుస్తోంది’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పోస్ట్ చేశారు. అయితే, ఆమె ముఖాన్ని ఈ ఫొటోలోనూ చూపించకపోవడం గమనార్హం. ‘చిరు ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్‌లో చూడడం సంతోషంగా ఉంది’, ‘ఎంజాయ్‌ సర్‌’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొన్ని క్షణాల్లోనే ఈ పిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

ఎప్పుడు కాస్త గ్యాప్ దొరికినా… ఫ్యామిలీతో టూర్ వేసే వాళ్లలో టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరసలో ఉంటారు. ఆయన ఫ్యామిలీకి టైమ్ కేటాయించినట్లుగా మరొకరు కేటాయించరనే విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు తర్వాత ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవే ఉంటారు. ఈ మధ్యకాలంలో కాస్త గ్యాప్ దొరికినా కూడా విశ్రాంతి కోసం చిరు ఫారెన్ వెళుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఫారెన్ వెళ్లింది టూర్ కోసం కాదు… పారిస్‌లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్ 24 ప్రారంభ వేడుకలకు హాజరయ్యేందుకు అని స్వయంగా మెగాస్టారే తన ట్వీట్‌ లో రివీల్ చేశారు.

ఇక మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీతో మెగాస్టార్ బాండింగ్ ఇదని కొందరు.. మీరెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి బాసూ అంటూ మరికొందరు, ఇదే మీకు దక్కిన అరుదైన గౌరవం అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌తో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Also Read : Parvathy Thiruvothu: నటిని కాకపోతే టీ షాపు పెట్టేదాన్ని అంటున్న ‘తంగలాన్‌’ నటి !

Global Star Ram CharanHyde Park LondonMegastar ChiranjeeviSummer Olympics 2024Upasana Konidela
Comments (0)
Add Comment