Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన రష్యా ప్రతినిధుల బృందం !

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన రష్యా ప్రతినిధుల బృందం !

Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్‌ లో సమావేశమైంది. అభివృద్ధి చెందుతున్న భారతీయ, తెలుగు చలన చిత్ర పరిశ్రమలు… రష్యా సృజనాత్మక రంగాల పరస్పర సహకారం దిశగా ఈ బృందం చిరంజీవితో చర్చలు జరిపారు.

Mega Star Chiranjeevi Meet

రష్యాలో తెలుగు సినిమాల చిత్రీకరణలని ప్రోత్సహించడంపై రష్యా బృందం తన ఆసక్తిని వ్యక్తం చేసింది. చిరంజీవి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మాస్కో ప్రభుత్వ మంత్రికి సినీ సలహాదారైన జూలియా గోలుబెవా, మాస్కో క్రియేటివ్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌, ఫెడరల్‌ ఏజెన్సీ ఫర్‌ స్ట్రాటజిక్‌ ఇన్షియేటివ్స్‌ హెడ్‌ ఎకటెరినా చెర్కెజ్‌ జాడే, యూనివర్సల్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ మరియా తదితరులు పాల్గొన్నారు.

Also Read : Robinhood Updates : నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాలో శ్రీలీల కు బదులు రాశీఖన్నా…!

Mega Star Chiranjeeviram charanRussia Film Deligates
Comments (0)
Add Comment