Mega Star Chiranjeevi: యోదా డయాగ్నోస్టిక్స్ కొత్త బ్రాంచ్‌ ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి !

యోదా డయాగ్నోస్టిక్స్ కొత్త బ్రాంచ్‌ ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి !

Mega Star Chiranjeevi: పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, మాదాపూర్‌ లో యోదా డయాగ్నొస్టిక్స్ కొత్త బ్రాంచ్‌ ని ఆదివారం ప్రారంభించారు. మంత్రి దామోదర్ రాజ నరసింహ, యోదా డయాగ్నొస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్‌ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోదా అధినేత కంచర్ల సుధాకర్‌ ను మంత్రి దామోదర్ రాజ నరసింహ ఒక ప్రశ్న అడిగారు. ఈ డయాగ్నొస్టిక్ సెంటర్ చాలా ఆధునికతగా ఉంది కదా, మరి ఇది పేద వారికి ఎంత వరకు అందుబాటులో ఉంటుంది? అని మంత్రి దామోదర్ రాజ నరసింహ ప్రశ్నకి అదే వేదికపై మెగాస్టార్ చిరంజీవి సమాధానమిచ్చారు.

Mega Star Chiranjeevi Inaugrated

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) మాట్లాడుతూ… వైద్య పరీక్షల ఖర్చు సినీ కార్మికులకు అందుబాటులో ఉండేలా చేయగలవా ? అని విజ్ఞప్తి చేయగానే యోదా డయాగ్నస్టిక్స్‌ ఫౌండర్‌, ఛైర్మన్‌ సుధాకర్‌ కంచర్ల కాదనలేదని పేర్కొన్నారు. యోదా కొత్త బ్రాంచ్‌ ఓపెనింగ్‌ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ‘‘చాలామంది సినీ కళాకారులు, కార్మికులు ఏ రోజు సంపాదనతో ఆ రోజు గడుపుతుంటారు. అలాంటి వారికి ఇక్కడ వైద్య పరీక్షలను అందుబాటు ధరల్లో చేయగలవా ? అని గతంలో అమీర్‌పేటలో ఈ సెంటర్‌ని ప్రారంభించిన సమయంలో సుధాకర్‌ను సడెన్‌గా అడిగా. కచ్చితంగా చేస్తానన్నయా అని చెప్పాడు.

ఆ మేరకు 14 వేల మంది కార్మికులకు చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌, యోదా డయాగ్నస్టిక్స్‌ సెంటర్‌ సంయుక్తంగా హెల్త్‌ కార్డులు ఇచ్చాయి. కార్డులు జారీ చేసిన వారితోపాటు కుటుంబానికీ వెసులుబాటు కల్పించారు. సామాజిక స్పృహ కలిగిన అతడిపై నాకు గౌరవం ఉంది’’ అని అన్నారు. ప్రసంగం అనంతరం పలువురు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు హెల్త్‌ కార్డులు అందించారు.

చిరంజీవి సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో బింబిసార ఫేం దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్రిష హీరోయిన్‌. సురభి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Also Read : Guntur Karam: 100 రోజులు పూర్తి చేసుకున్న ‘గుంటూరు కారం’ సినిమా ! ఎక్కడో తెలుసా?

 

Mega Star ChiranjeeviYodha Diagnostics
Comments (0)
Add Comment