Meera Jasmine: మీరా జాస్మిన్‌ ఇంట విషాదం !

మీరా జాస్మిన్‌ ఇంట విషాదం !

Meera Jasmine: టాలీవుడ్ నటి మీరా జాస్మిన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్‌ ఫిలిప్‌ (83) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. గతకొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎర్నాకులంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీనితో మీరా జాస్మిన్‌(Meera Jasmine) ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. జోసెఫ్‌ ఫిలిప్‌ భార్య పేరు ఎలియమ్మ. వీరికి సారా, జేని, జార్జ్‌, జాయ్‌, మీరా అని ఐదుగురు సంతానం. మీరా జాస్మిన్‌ అందరిలో కంటే చిన్నది.

Meera Jasmine Father No More

మీరా జాస్మిన్‌… సూత్రధారన్‌ అనే మలయాళ చిత్రంలో కెరీర్‌ ఆరంభించింది. రన్‌ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పందెం కోడి, గుడుంబా శంకర్‌, భద్ర, రారాజు, మహారథి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటిపిల్లాడు.. ఇలా అనేక సినిమాలు చేసింది. 2014లో దుబాయ్‌ ఇంజనీర్‌ అనిల్‌ జాన్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య తగ్గించేసిన మీరా జాస్మిన్… సముద్రఖని ప్రధాన పాత్రలో గతేడాది విడుదలైన విమానం సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది.

Also Read : Save The Tigers 2: ఓటీటీలో దేశ వ్యాప్తంగా దుమ్ము రేపుతోన్న సేవ్ ది టైగర్స్ సీజన్‌-2 !

Meera JasmineVimanam
Comments (0)
Add Comment