Meera Chopra: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన ‘బంగారం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ మీరా చోప్రా. ఆ తరువాత తెలుగులో వాన, మారో, గ్రీకువీరుడు వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆశించినంత గుర్తింపు దొరకలేదు. దీనితో ఆమె తమిళం, హిందీ సినిమాలకే పరిమితం అయ్యింది. ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రా ఆమెకు కజిన్ సిస్టర్స్ గా ఉన్నప్పటికీ… ఆమె సినిమాల్లో మాత్రం ఆమె ఎప్పుడూ స్వంతంగానే అవకాశాలు దక్కించుకుంది. అయితే ఈ బ్యూటీ చాలా కాలంలో ఓ వ్యక్తితో సీక్రెట్ డేటింగ్ చేస్తుందంటూ బీటౌన్ వర్గాల్లో పుకార్లు షికార్లు చేసాయి. అయితే ఈ విషయంపై ఆమె ఎప్పుడూ స్పందించలేదు. అయితే ఎట్టకేలకు ఆ రూమర్స్ కు చెక్ పెట్టింది మీరా చోప్రా(Meera Chopra). తన ప్రియుడు, ముంబైకు చెందిన వ్యాపార వేత్త రక్షిత్ కేజ్రీవాల్ తో మూడు ముళ్ల బంధంలోనికి అడుగుపెడుతున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Meera Chopra Marriage Updates
ముంబైలో ప్రముఖ వ్యాపార వేత్తగా గుర్తింపు పొందిన రక్షిత్ కేజ్రీవాల్ తో మీరా చోప్రా గత మూడేళ్ళుగా డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ నెల 11న ఈ జంట వివాహ బంధంలోనికి అడుగుపెడుతున్నట్లు స్వయంగా మీరా చోప్రా(Meera Chopra) ప్రకటిస్తూ… పెళ్ళికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జైపూర్ లోని బ్యూనా విస్తా లగ్జరీ గార్డెన్ స్పా రిసాప్ట్ లో ఈమె పెళ్లి 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది.
ఈనెల 11వ తేదీన మెహందీ ఫంక్షన్ తో మీరా చోప్రా పెళ్లి సంబరాలు షురూ అవుతాయి. అదే రోజు సాయంత్రం సంగీత్, కాక్ టైల్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. ఇక 12వ తేదీన ఉదయం హల్దీ ఫంక్షన్ తో అసలైన పెళ్లి తంతు మొదలౌతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మీరా చోప్రా, రక్షిత్ వైవాహిక బంధంలోకి అడుగుపెడతారు. ఇక అదే రోజు రాత్రి 9 గంటల నుంచి రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతోంది మీరా చోప్రా. పెళ్లి కోసం వీళ్లు ఏకంగా రిసార్ట్ మొత్తాన్ని బుక్ చేశారు. ఆహుతులకు తప్ప వేరే వాళ్లకు ఆ 2 రోజుల్లో ప్రవేశం నిషిదించినట్లు తెలుస్తోంది.
Also Read : Ram Gopal Varma: థియేటర్లలో ‘వ్యూహం’ ! ఓటీటీలో ‘శపథం’ !