Meenakshi : తమిళ సినీ రంగానికి చెందిన మీనాక్షి చౌదరి ఇప్పుడు బిజీగా ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడింది. తను తాజాగా విక్టరీ వెంకటేశ్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఊహించని సక్సెస్ అయ్యింది. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది. రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రంలో మాజీ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). అద్భుతంగా నటించింది మెప్పించడంతో పలు సినిమాలలో ఆఫర్లు కూడా వస్తున్నాయని వినికిడి.
Meenakshi Chaudhary..
మూవీ సూపర్ హిట్ కావడంతో మీనాక్షి చౌదరి సమ్మర్ వెకేషన్ కోసం దుబాయ్ కి వెళ్లింది. అక్కడ పలు ఫోటో షూట్స్ లలో పాల్గొంది. కొన్ని యాడ్స్ కు కూడా పని చేస్తోంది. తాజాగా సినీ నటులు, నటీమణులు, మోడల్స్ ఎప్పుడైనా ఒకసారి ముఖ చిత్రంగా జస్ట్ ఫర్ ఉమెన్ మ్యాగజైన్ పై ఉండాలని అనుకుంటారు.
ఈ మ్యాగజైన్ కు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ ఉండడంతో ఎక్కువగా ఇందులో ఫోటోలు రావాలని కోరుకుంటారు. తాజాగా చాందినీ చౌదరి తళుక్కున జె ఎఫ్ డబ్ల్యూ పత్రిక ముఖ చిత్రంగా వచ్చింది. మ్యాగజైన్ కవర్ పై ఆత్మ విశ్వాసం, శక్తి, దయను ప్రదర్శించేలా ఫోజు ఇచ్చింది.
స్టైలిష్ సన్ గ్లాసెస్ తో జత చేసిన చిక్ క్రీమ్ రంగు స్నఫ్ జాకెట్ ధరించింది మీనాక్షి చౌదరి ఆకట్టుకునేలా ఉంది. తన చూపులతో కట్టి పడేసేలా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ షూట్ ను సుందర్ రాము చిత్రీకరించారు.
Also Read : Renu Desai- Shocking :బూతుల పర్వం రేణూ దేశాయ్ ఆగ్రహం