Beauty Meenakshi-Chaitanya : చైతూతో మీనాక్షి చౌద‌రి మూవీ

ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న వ‌శిష్ట

Meenakshi : చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్లవి, అక్కినేని నాగ చైత‌న్య క‌లిసి న‌టించిన తండేల్ చిత్రం ఆశించిన దానికంటే బిగ్ స‌క్సెస్ అయ్యింది. గీతా ఆర్ట్స్ స‌మ్ప‌ర‌ణ‌లో బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. రూ. 50 కోట్లు ఖ‌ర్చు చేస్తే నిర్మాత‌కు ఇప్ప‌టికే రూ. 100 కోట్ల‌ను దాటేసింది. ఇంకా థియేట‌ర్ల‌లో తండేల్ ను చూసేందుకు ప్రేక్ష‌కులు వ‌స్తుండ‌డం విశేషం.

Meenakshi Chaudhary Moviee with Naga Chaitanya

ఇక నాగ చైత‌న్య సినీ కెరీర్ లోనే తండేల్ బిగ్గెస్ట్ స‌క్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. దీంతో త‌ను ఆనందంగా ఉన్నాడు. చిత్రం బృందం స‌క్సెస్ మీట్స్ నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. ఇటీవ‌లే టీమంతా క‌లిసి తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. తాము సినిమా తీసిన‌ప్పుడే స్వామి వారి ఆశీర్వాదం కోసం వ‌స్తామ‌ని మొక్కుకున్నామ‌ని అన్నారు నిర్మాత‌.

ఇదిలా ఉండ‌గా టాలీవుడ్ లో మ‌రో వార్త గుప్పుమంటోంది. సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాలో విక్ట‌రీ వెంక‌టేశ్ కు మాజీ గ‌ర్ల్ ఫ్రెండ్ పాత్ర‌లో న‌టించి మెప్పించిన త‌మిళ సినీ రంగానికి చెందిన మీనాక్షిచౌద‌రి(Meenakshi)తో క‌లిసి నాగ చైత‌న్య ఓ మూవీలో చేయ‌బోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ చిత్రానికి బింబిసార ద‌ర్శ‌కుడు వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ప్ర‌స్తుతం త‌ను మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభ‌ర చిత్రం తీస్తున్నాడు. క‌థ కూడా ఓకే అయ్యిందని, త‌న కెరీర్ లోనే ఇది భారీ బ‌డ్జెట్ చిత్రం అవుతుంద‌ని పేర్కొన్న‌ట్లు టాక్. ఇందుకు గాను మీనాక్షి చౌద‌రి కూడా ఓకే చెప్పింద‌ని ఇక షూటింగ్ ప్రారంభం కావ‌డ‌మే మిగిలి ఉంది.

Also Read : స్పెయిన్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ

Akkineni Naga ChaitanyaMeenakshi ChaudharyNew MoviesTrendingUpdates
Comments (0)
Add Comment