Beauty Meenakshi Chaudhary :ఆ ఒక్క కోరిక మిగిలి పోయింది

న‌టి మీనాక్షి చౌద‌రి కామెంట్

Meenakshi Chaudhary : స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌద‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అంద‌రికీ ఉన్న‌ట్టే త‌మ‌కు కూడా కోరిక‌లు ఉంటాయ‌ని పేర్కొంది. మాకు కూడా ల‌క్ష్యాలు ఉంటాయి. సినిమా అనేది ఓ రంగుల లోకం. ఇందులో అదృష్టం ఉంటే పాత్ర‌లు వ‌స్తాయ‌ని అంటారు. కానీ నేను వీటిని ఒప్పుకోనని చెప్పింది. క‌ష్ట‌ప‌డితే, మ‌న‌కు ఇచ్చిన పాత్ర‌లలో లీన‌మై వంద శాతం ఫోక‌స్ పెడితే స‌క్సెస్ అవుతామ‌ని నా న‌మ్మ‌కం. ఇదే నేను న‌మ్ముతా.

Meenakshi Chaudhary Comments Viral

ఒక‌స్థాయికి రానంత వ‌ర‌కు మాత్ర‌మే మ‌నం క‌ష్ట‌ప‌డతాం. కానీ మ‌రో స్టేజ్ కు వెళ్లాక ఇక తిరుగంటూ ఉండ‌ద‌ని మీనాక్షి చౌద‌రి(Meenakshi Chaudhary) అంటోంది. హీరోయిన్లు కూడా మ‌నుషులమే. మాకు క‌ల‌లు ఉంటాయి..క‌న్నీళ్లు ఉంటాయి..ఆలోచ‌న‌లు..ఆనందాలు కూడా ఉంటాయ‌ని తెలిపింది.

నేను అనుకోకుండా ఈ రంగంలోకి వ‌చ్చా. త‌న లైఫ్ లో నాకంటూ కొన్ని ల‌క్ష్యాలు ఉండేవి. అందులో మూడు కోరిక‌లు ఉన్నాయి. వాటిలో రెండింటిని పుల్ ఫిల్ చేశా. కానీ మ‌రోటి మాత్రం అందుకోలేక పోయాన‌ని వాపోయింది. ఎందుకంటే దానిని పొందాలంటే ఏజ్ స‌రిపోద‌ని తెలిపింది.

యాంక‌ర్ కావాల‌ని అనుకున్నా. అది తీరి పోయింది. మోడ‌ల్ కావాల‌ని అనుకున్నా మిస్ ఇండియా ద‌క్కింది. సివిల్ స‌ర్వెంట్ అవుదామ‌ని బ‌లంగా కోరిక ఉండేది. ఆ రెండూ పూర్తి చేసినా ..చివ‌ర‌గా సివిల్స్ కు ఎంపిక‌య్యే ఛాన్స్ కోల్పోయాన‌ని వాపోయింది.

Also Read : Murali Mohan Shocking :లీడ‌ర్ల కంటే సినిమా వాళ్ల‌కే ఆద‌ర‌ణ ఎక్కువ‌

CommentsMeenakshi ChaudharyViral
Comments (0)
Add Comment