Meenakshi Chaudhary: బాక్సింగ్‌ శిక్షణలో మహేశ్ బాబు బ్యూటీ !

బాక్సింగ్‌ శిక్షణలో మహేశ్ బాబు బ్యూటీ !

Meenakshi Chaudhary: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాతో సినీ ప్రియుల్ని విశేషంగా అలరించిన నటి మీనాక్షి చౌదరి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ లో నటిస్తోంది. దీనితో పాటు తెలుగు, తమిళ భాషల్లో వరుసగా అగ్రహీరోలతో జోడీ కడుతూ స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం విజయ్ తో నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మీనాక్షి చౌదరి… థాయ్ లాండ్ లో బాక్సింగ్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది. ఇదే విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాదు తాను బాక్సింగ్ ప్రాక్టిస్ చేస్తున్న ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి బాక్సింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Meenakshi Chaudhary Taining…

బాక్సింగ్ రింగ్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసిన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary)… ‘‘ఈ థాయ్‌ ట్రిప్‌ ప్రధాన లక్ష్యం కచ్చితంగా ముయే థాయ్‌ బాక్సింగ్‌ నేర్చుకోవడమే’’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీంతో ఇప్పుడామె ఈ బాక్సింగ్‌ నేర్చుకోవడానికి కారణం… విజయ్‌ సినిమానేనని ప్రచారం జరుగుతోంది. విజయ్ సినిమాలో ఆమె యాక్షన్‌ పాత్రలో కనిపించనుందని… త్వరలో మొదలు కానున్న షెడ్యూల్‌ లో తనపై యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నారని వార్తలు మొదలయ్యాయి. మరి ఆమె నిజంగానే దీంట్లో యాక్షన్‌ పాత్రలో కనిపిస్తుందా… లేదా ? అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రంలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఈ చిత్ర ఆఖరి షెడ్యూల్‌ వచ్చే నెల నుంచి రష్యాలో ప్రారంభం కానుందని సమాచారం. మీనాక్షి ప్రస్తుతం తెలుగులో ‘మట్కా’, ‘లక్కీ భాస్కర్‌’, ‘మెకానిక్‌ రాకీ’ చిత్రాల్లో నటిస్తోంది.

Also Read : Daniel Balaji: ప్రముఖ న‌టుడు ‘డేనియ‌ల్ బాలాజీ’ ఆకస్మిక మృతి !

Guntur KaaramMeenakshi ChaudharyThe Greatest of All Time
Comments (0)
Add Comment