Meenakshi Chaudhary : ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రానికి సంబంధించిన మహిళా సాధికారతను మరింత పెంపొందించేందుకు గాను ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరిని ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా మీనాక్షి చౌదరి మహిళా సాధికారత, అభివృద్ది, తదితర కార్యక్రమాలను తను ప్రచారం చేస్తుంది. అన్ని రకాలుగా అమలు చేసే పథకాలను ప్రమోట్ చేస్తుంది.
Meenakshi Chaudhary as a AP Brand Ambassador
ఇదిలా ఉండగా మీనాక్షి చౌదరిని(Meenakshi Chaudhary) బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. కాగా తనను ప్రచారకర్తగా నియమించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
మీనాక్షి చౌదరి తమిళ సినీ రంగంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తను దళపతి విజయ్ తో నటించింది. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో కీలక పాత్ర పోషించింది.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కు మాజీ గర్ల్ ఫ్రెండ్ గా కిర్రాక్ తెప్పించేలా చేసింది. మరో పాత్రలో ఐశ్వర్య రాజేశ్ వెంకీకి భార్యగా నటించింది. ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. రికార్డ్ బ్రేక్ చేసింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
Also Read : Dragon Song Sensational :పాట పరవశం హృదయ సమ్మేళనం