Meena: తెలుగు చలన పరిశ్రమకు సంబంధించిన హీరోహీరోయిన్లను విమర్శిస్తూ కొందరు చేసిన, చేస్తున్న వీడియోలతో పాటు కామెంట్లను తొలగించాలంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేయడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటామని ఇటీవల వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తమ యూట్యూబ్ ఛానల్స్‌లలో ట్రోలింగ్ వీడియోలను తొలగించమని హెచ్చరించారు. ఇక నుంచి మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే సహించమని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ఆయనకు నెటిజన్ల నుంచి కూడా మద్ధతు లభించింది.
Meena Comment
ఈ నేపథ్యంలోనే అభ్యంతరకరమైన కంటెంట్‌తో యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టేలా మంచు విష్ణు చేశారు. మహిళలపై అసభ్యకర కంటెంట్‌తో రన్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌ల గుర్తింపును శాశ్వితంగా రద్దు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇలా ఆయన చూపిన దూకుడుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. తాజాగా సినియనర్ నటి మీనా(Meena) రియాక్ట్ అయ్యారు.
‘అనేక యూట్యూబ్ ఛానెల్‌లలో మహిళలను అవమానించేలా కంటెంట్‌తో నిండిపోయాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు మా అధ్యక్షులు మంచు విష్ణు తొలి అడుగు వేశారు. సోషల్ మీడియా వల్ల మేము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా కూడా పరువుకు భంగం కలిగించే కామెంట్స్‌ను ఎదిరించడంలో విఫలం అయ్యాం. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్న మంచు విష్ణు నేతృత్వంలోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి చాలా ధన్యవాదాలు. మా పరిశ్రమ సమగ్రతను కాపాడటంలో మీ అంకితభావం నిజంగా అభినందనీయం.
మనం అందరం కలిసి గౌరవం, సమగ్రతతో కూడిన సంస్కృతిని పెంపొందించేలా కలిసికట్టుగా ఉండాలి. ఇక్కడ కళాకారులు, వారి కుటుంబాలపై కామెంట్లు చేయడంలో సోషల్ మీడియా తారాస్థాయికి చేరుకుంది. చలనచిత్ర పరిశ్రమ గౌరవప్రదమైన స్థానంలో ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. విష్ణు, మీ చర్యలు నిజంగా అభినందనీయం,’ అంటూ మీనా(Meena) రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె రియాక్షన్ నెట్టింట వైరల్ గా మారుతోంది.
Also Read : Lucy: మహదేవ్ చిరంజీవి ‘లూసీ’ ఫస్ట్ లుక్ విడుదల !