Hero Sundeep Kishan Mazaka : ‘మ‌జాకా’ కెవ్వు కేక‌ న‌వ్వించ‌డం ప‌క్కా

న‌మ్మ‌కంతో ఉన్న డైరెక్ట‌ర్

Mazaka : టాలీవుడ్ లో ఇప్పుడు రొమాంటిక్, కామెడీ, థ్రిల్ల‌ర్ కు ప్రయారిటీ ఇచ్చే మూవీస్ కు ఆద‌ర‌ణ ఉంటోంది. దీనినే బేస్ గా చేసుకుని ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కొత్త మూవీస్ పై దృష్టి సారించారు. ఈ సంద‌ర్బంగా సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి. మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చ‌ర‌ణ్ తేజ న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ బోల్తా ప‌డింది. ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో నంద‌మూరి బాల‌య్య న‌టించిన డాకు మ‌హారాజ్, విక్ట‌రీ వెంక‌టేశ్ న‌టించిన సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రాలు విడుద‌ల‌య్యాయి.

Mazaka Movie Updates

ఈ రెండూ దుమ్ము రేపాయి. 130 కోట్ల‌కు పైగా బాల‌య్య మూవీ వ‌సూలు చేస్తే వెంకీ మూవీ మాత్రం ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. వెంక‌టేశ్ సినీ కెరీర్ లోనే బిగ్ హిట్ చిత్రంగా నిలిచింది. న‌వ్వుల‌ను పండించే ద‌ర్శ‌కుడిగా పేరొందిన అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించాడు. న‌వ్వులు పూయించే ప్ర‌య‌త్నం చేశాడు. కాసులు కురిపించేలా చేశాడు.

అదే కోవ‌లో మ‌రో చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఫిబ్ర‌వ‌రి 26న మూవీ మేక‌ర్స్ ఫిక్స్ చేశారు. ధ‌మాకా మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌జాకా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్బంగా ఈ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. రెండు గంట‌ల పాటు క‌డుపుబ్బా న‌వ్వించేలా సినిమా తీశాన‌ని, న‌వ్వించ‌క పోతే ఒట్టు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇందులో సందీప్ కిష‌న్(Sundeep Kishan) , రీతూ వ‌ర్మ‌, రావు ర‌మేష్, అషు కీల‌క పాత్ర‌లలో న‌టించారు. పూర్తిగా కామెడీ ఎంట‌ర్ టైన్మెంట్ గా దీనిని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు.

Also Read : Beauty Malavika Mohanan :డార్లింగ్ ఆతిథ్యం మాళ‌విక సంతోషం

CinemaMazakaTrendingUpdates
Comments (0)
Add Comment