Mohan Babu : బయటకు వస్తే చాలు బౌన్సర్స్, బాడీ గార్డ్స్‌తో కినిపించే సినీ తారలకు తమ ఇంట్లో పనిమనుషుల చేతివాటం తిప్పలు తప్పడం లేదు. తాజాగా సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో మరోసారి భారీ చోరీ జరిగింది. జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసంలో పనిచేస్తున్న నాయక్ రూ.10 లక్షలతో పారిపోయాడు. ఇంట్లోని ఓ బీరువాలో వస్తువులు చిందర వందరగా పడేసి ఉండడాన్ని గుర్తించి ఇంట్లోని వారు మోహన్ బాబు(Mohan Babu) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇంట్లో పని చేసే నాయక్ మీద అనుమానంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోహన్ బాబు.. నిన్న (మంగళవారం) రాత్రి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.
In Mohan Babu’s house…
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే నాయక్ కోసం గాలింపు మొదలు పెట్టారు. అయితే అ పని మనిషిని తిరుపతిలో పట్టుకున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా 2019లోనూ ఓ సారి ఫిలింనగర్‌లోని ఇంటిలో పని మనిషఙ నగలు,నగదు అపహరణ చేసినట్లు నాడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం విశేషం. కాగా ప్రస్తుతం మోహన్ బాబు మంచు విష్ణు కథానాయకుడిగా కన్నప్ప అనే హిస్టారికల్ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో పాటు ఓ కీలక పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : AP High Court : దేవర టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు కీలక ఉత్తర్వులు