Mass: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ మూవీ ‘మాస్(Mass)’. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మించిన ఈ సినిమాలో జ్యోతిక, చార్మికౌర్, రఘువరన్, ప్రకాష్‌రాజ్, రాహుల్ దేవ్ కీలకపాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. 2004లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాను మరోసారి రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
టాలీవుడ్ లో మన్మథుడిగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. నాగార్జున పుట్టిన రోజుకు ఒక్కరోజు ముందు అంటే ఆగస్టు 28న ఈ ‘మాస్’ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీనితో కింగ్ నాగార్జున సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
Mass – ‘మాస్’ కథేమిటంటే ?
గణేశ్ (నాగార్జున) ఆది (సునిల్) ఒక అనాధ.. ఇద్దరూ మంచి స్నేహితులు. అంజలి (జ్యోతిక) వైజాగ్ మాఫియా డాన్ సత్య(రఘువరన్) కుమార్తె గణేశ్ ప్రేమలో పడుతుంది. ఇద్దరు పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ విషయం తెలిసి కుమార్తెను తీసుకురమ్మని సత్య తన కొడుకుని పంపుతాడు. ఆదిని హత్యచేసి అంజలిని తీసుకువెళ్తాడు. తన ప్రాణ స్నేహితుడుని చంపిన వారిని గణేశ్ ఎలా చంపుతాడు, అలాగే తను ప్రేమించిన అంజలిని ఎలా దక్కించుకుంటాడు అనేది సినిమా ఇతివృత్తం.
Also Read:Krishna Vamsi: పవన్ కళ్యాణ్ తో సినిమాపై కృష్ణవంశీ ఆశక్తికర వ్యాఖ్యలు !