Mass Maharaj Raviteja: రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’.. షూటింగ్‌ షురూ!

రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’.. షూటింగ్‌ షురూ!

Mass Maharaj Raviteja: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, ధమాకా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమాకు… గురువారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది చిత్ర యూనిట్.

Mass Maharaj Raviteja Movie Updates

మొదటి రోజు షూటింగ్ లో రవితేజతో పాటు పలువురు కీలక నటులు పాల్గొన్నారు. సీన్ 6, షాట్ 34తో షూట్ ప్రారంభించినట్లు… రవితేజ(Raviteja) స్వయంగా ప్రకటిస్తూ మొదటి రోజు షూటింగ్ ఫోటోలను విడుదల చేసారు. ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ సినిమాలో రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read : Hero Vijay: ‘లియో2’ స్వీక్వెల్ ఉందంటున్న లోకేష్ కనగరాజ్‌…

Harish Sankarraviteja
Comments (0)
Add Comment