Mass Maharaj Ravi Teja: కొత్త వ్యాపారంలోకి మాస్‌ మహారాజా రవితేజ !

కొత్త వ్యాపారంలోకి మాస్‌ మహారాజా రవితేజ !

Mass Maharaj Ravi Teja: సినిమా హీరోలకు వ్యాపారం కొత్త కాదు. చాలా మంది టాలీవుడ్‌ హీరోలు తమ వృత్తితో పాటు పలు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. పబ్స్, హోటల్స్, ఎయిర్ లైన్స్ వ్యాపారాలు కొంతమంది చేస్తే మరికొంతమంది మాత్రం థియేటర్స్ బిజినెస్ లో రాణిస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ఫ్యామిలీ స్టార్ విజయ్‌ దేవరకొండ… ఇటీవల అత్యాధునికి టెక్నాలజీతో సుందరమైన థియేటర్స్‌ ను నెలకొల్పి బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. మహేష్ బాబు ‘AMB’ పేరుతో ఏషియన్‌ సినిమాస్‌ భాగస్వామ్యంతో గచ్చిబౌలిలో భారీ మల్టీప్లెక్స్‌ నిర్మించారు. బెంగుళూరులో కూడా మరో థియేటర్‌ ను త్వరలో ప్రారంభించనున్నారు. ఏడాది క్రితం అల్లు అర్జున్… అమీర్‌పేట్‌ లో ‘AAA’ సినిమాస్ పేరుతో మల్టీఫ్లెక్స్‌ ను నిర్మించారు. విజయ్‌ దేవరకొండ మహబూబ్‌నగర్‌ లో ‘AVD’ పేరుతో మూడు స్క్రీన్స్ ఉన్న థియేటర్‌ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ స్టార్‌ హీరోలందరూ ఏషియన సినిమాస్‌ తో పార్టనర్‌ షిప్‌ పెట్టుకుని థియేటర్స్ బిజినెస్ ప్రారంభించడం గమనార్హం.

Mass Maharaj Ravi Teja Enter into New

ఇప్పుడు వారి బాటలో మాస్‌ మహారాజా రవితేజ(Ravi Teja) కూడా వెళ్లబోతున్నట్లు సమాచారం. రవితేజ కూడా ఏషియన్‌ సినిమాస్‌ భాగస్వామ్యంతో ఒక మల్టీఫ్లెక్స్‌ ను హైదరాబాద్‌ లో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు స్క్రీన్స్ తో దిల్‌ సుఖ్‌నగర్‌ లో ఈ మల్టీప్లెక్స్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మల్టీప్లెక్స్‌ కు ఏషియన్‌ రవితేజ పేర్లు కలిసి వచ్చేలా ‘ART’ సినిమాస్‌ అనే పేరు పెట్టబోతున్నట్లు తెలిసింది. రవితేజ నుండి కాని ఏషియన్ సినిమాస్ నుండి ఇంకా అధికారిక సమాచారం రాకపోయినప్పటికీ… వీటి ప్రారంభానికి ముందే ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Also Read : Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’లో మరో ఇద్దరు కొత్త హీరోయిన్లు !

Asian CinemasMass Maharaj Ravi Teja
Comments (0)
Add Comment