Maruthi Nagar Subramanyam: విలక్షణ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కించిన తాజా సినిమా ‘మారుతీనగర్ సుబ్రమణ్యం(Maruthi Nagar Subramanyam)’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి కీలక పాత్ర పోషించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించారు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా ఆగస్టు 23న విడుదలై బాక్సాఫీసు వద్ద ఫరవాలేదు అనిపించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమా ఈ నెల 20 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతుందని తెలియజేస్తూ పోస్టర్ పంచుకుంది.
Maruthi Nagar Subramanyam – ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ కథేమిటంటే ?
సుబ్రమణ్యం (రావు రమేశ్) ఓ నిరుద్యోగి. ప్రభుత్వ ఉద్యోగమే చేయాలనే పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ, ఫలితం కనిపించదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికైనా, అది కాస్తా కోర్టు గొడవలతో చేతికందదు. దాంతో భార్య కళారాణి (ఇంద్రజ) సంపాదనపైనే ఆధారపడుతూ కాలం వెళ్లదీస్తుంటాడు. అబ్బాయి అర్జున్ (అంకిత్ కొయ్య) పెద్దవాడయినా సుబ్రమణ్యానికి ఉద్యోగం మాత్రం రాదు. మరోవైపు, అర్జున్ తొలి చూపులోనే కాంచన (రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. తన కొడుకు ప్రేమని నిలబెట్టేందుకు కాంచన ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడిన సుబ్రమణ్యానికి ఎలాంటి అనుభవం ఎదురైంది? అనూహ్యంగా తన ఖాతాలో పడిన రూ.10 లక్షల డబ్బుని అవసరాల కోసం తండ్రీ కొడుకులు ఖర్చు పెట్టేశాక ఏం జరిగింది? ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? అర్జున్, కాంచన ఒక్కటయ్యారా? సుబ్రమణ్యానికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? అన్నది మిగతా కథ.
Also Read : Manyam Dheerudu: ‘మన్యం ధీరుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్ !