Maruthi Nagar Subramanyam : రావు రమేశ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘మారుతీనగర్ సుబ్రమణ్యం(Maruthi Nagar Subramanyam)’ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇంద్రజ , అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్థన్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్, అజయ్ ఇతర పాత్రల్లో నటించగా లక్షణ్ కార్య దర్శకత్వం వహించాడు. ప్రముఖ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ భార్య తబిత ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించింది. ఆగస్టు 23న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అద్భుతమైన టాక్‌తో మంచి విజయం సాధించింది.
Maruthi Nagar Subramanyam Movie OTT Upddates
కథ విషయానికి వస్తే.. మారుతీనగర్‌లో నివసించే ఓ నిరుద్యోగి సుబ్రమణ్యం (రావు రమేష్). చాలా ప్రభుత్వాలకు ప్రయత్నించినా ఏది రాదు. చివరకు టీచర్ జాబ్ వచ్చినప్పటికీ అది కాస్త కోర్టులో ఉండడంతో 25 సంవత్సరాలు ఏ పనీ లేకుండా భార్య కళారాణి (ఇంద్రజ) జీతం మీద ఆధార పడుతుంటాడు. అలాంటిది సడన్‌గా ఓ రోజు అనుకోకుండా సుబ్రమణ్యం అకౌంట్‌లో రూ.10 లక్షల డబ్బు జమ కావడంతో ఎగిరి గంతేస్తారు. తొందరలో తమ జల్సాల కోసం తండ్రీ కొడుకులిద్దరు ఆ డబ్బును ఖర్చు చేస్తారు.
ఈ క్రమంలో అసలు విషయం తెలిసి ఏం చేశారు, ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? వఆరి అకౌంట్‌లో ఎందుకు పడింది, అర్జున్, కాంచనల ప్రేమ విజయవంతం అయిందా ? సుబ్రమణ్యం ప్రభుత్వ ఉద్యోగం పరిస్థితి ఏమైందన్నదే కథ. ముఖ్యంగా ఈ మూవీ కథ అంతా రావు రమేశ్ చుట్టూ తిరుగుతూ మధ్య తరగతి కుటుంబంలో ఉండే ఇబ్బందులు, భావోద్వేగాలను చక్కగా చూపించారు. ప్రతి సన్నివేశం నుంచి హస్యం పండేలా డిజైన్ చేశారు. అల్లు అర్జున్, అరవింద్ రిఫరెన్స్‌లతో వచ్చే సన్నివేశాలు బాగా నవ్వులు పంచుతాయి. పాటలు విపసొంపుగా ఉండగా, కథ, వినోదం, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మిస్సయిన వారు ఈ సినిమాను ఓటీటీలో అసలు మిస్సవకండి.
Also Read : Maa Nanna Super Hero : సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా వైరల్ అవుతున్న సాంగ్