Martin: కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా, వైభవి శాండిల్య జంటగా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మార్టిన్’. ఈ సినిమాకి సీనియర్ హీరో అర్జున్ కథ అందించగా… ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వాసవి ఎంటర్‌ప్రైజెస్ ద్వారా ఉదయ్ కె మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Martin…
అయితే రూ. 3 కోట్ల వరకు విశాఖ వాసి సత్యారెడ్డి తమను మోసం చేశాడంటూ మార్టిన్ చిత్ర నిర్మాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీనితో నిందితుడు సత్యారెడ్డిని విశాఖపట్నంలో కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మార్టిన్ సినిమాకు సంబంధించిన విఎఫ్‌ఎక్స్ వర్క్‌ను సత్యారెడ్డి ఏజన్సీకి సదరు నిర్మాత అప్పగించారు. అయితే, డబ్బు తీసుకుని ఆ సినిమాకు చేయాల్సిన పనిని చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని నిర్మాత ఉదయ్ కె మెహతా ఆరోపిస్తున్నారు.
‘మార్టిన్(Martin) సినిమాకు ప్రత్యేక గ్రాఫిక్స్, సిజి, విఎఫ్‌ఎక్స్ వర్క్ అవసరం కాబట్టి మేము గత జూన్-జూలైలో సత్యారెడ్డి నేతృత్వంలోని గ్రాఫిక్ డిజైన్ ఏజెన్సీని సంప్రదించాము. మేము వారికి అడ్వాన్స్‌గా రూ. 3 కోట్ల రూపాయలు చెల్లించాము. అయితే, సినిమాకు సంబంధించిన పని విషయంలో సత్య ఆలస్యం చేస్తూ గత డిసెంబర్ నుంచి కనిపించకుండా పోయాడు. ఈ జూన్‌లో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. దీనితో ఆయన్ను అరెస్టు చేశారని మార్టిన్ చిత్ర నిర్మాత చెప్పారు. సినిమా విడుదల ఆలస్యానికి సత్యారెడ్డి ప్రధాన కారణమని ఆయన తెలిపారు. ఆయన నిర్లక్ష్యం వల్ల తాము 15 వేర్వేరు సంస్థలకు గ్రాఫిక్స్ పనిని అప్పగించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ పోలీస్ స్టేషనులో సత్యారెడ్డిపై ఉదయ్ కె మెహతా చీటింగ్ కేసు పెట్టారు. తాజాగా ఆయన బెంగళూరు నుంచి విశాఖ వచ్చిన పోలీసులు సత్యారెడ్డిని అరెస్ట్ చేశారు.
Also Read : Shraddha Srinath: ‘మెకానిక్ రాకీ’ కి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ !