Manyam Dheerudu: ‘మన్యం ధీరుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

‘మన్యం ధీరుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Manyam Dheerudu: ఆర్‌వివి మూవీస్ పతాకంపై శ్రీమతి ఆర్ పార్వతీదేవి సమర్పణలో నరేష్ డెక్కల దర్శకత్వంలో ఆర్ వి వి సత్యనారాయణ నటించి, నిర్మించిన చిత్రం ‘మన్యం ధీరుడు(Manyam Dheerudu)’. ఆర్ వి వి సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 20వ తేదీన గ్రాండ్‌ గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ వంటి ప్రదేశాలలో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. అల్లూరి కథని కళ్లకు కట్టినట్లు చూపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. కాగా, ఈ చిత్ర విడుదల తేదీని తెలుపుతూ.. మేకర్స్ విడుదల చేసిన స్టిల్స్.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని రామ్ చరణ్‌ ని తలపిస్తుండటం విశేషం.

Manyam Dheerudu Movie Updates

ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా గురించి చెబుతూ.. అల్లూరి సీతారామరాజు నిజ రూప చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడానికి నటులు ఆర్ వి వి సత్యనారాయణ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విల్లు విద్యలో శిక్షణ తీసుకున్నారు. ‘మన్యం ధీరుడు’ చిత్రంలో యదార్ధ సన్నివేశాలు, యదార్ధ సంఘటనలు ప్రజలకి అందించాలనే సంకల్పంతో ఆర్ వి వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. బానిస సంకెళ్ళు తెంచుకుని బ్రిటీష్ తెల్లదొరల పాలనకు చరమగీతం పాడే సన్నివేశాలు ఇందులో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. ఈ చిత్రం కోసం భారీ ఖర్చుతో ఒక ఊరినే నిర్మించి అక్కడ షూట్ చేయడానికి సాహసోపేతమైనటువంటి సన్నివేశాలు ఎన్నో కళ్ళకు కట్టినట్టు చూపించే చిత్రం మన్యం ధీరుడు. ఈ చిత్రానికి సంగీతం పవన్ కుమార్, కెమెరా వినీత్ ఆర్య మరియు ఫరూక్, ఎడిటర్ శ్యాం కుమార్ అత్యద్భుతమైన వర్క్ అందించారని తెలిపారు.

Also Read : Natural Star Nani: సెట్స్‌ పైకి నాని 32వ సినిమా !

Manyam DheeruduRRR
Comments (0)
Add Comment