Mansoor Ali Khan: దక్షిణాది నటి త్రిషపై అసభ్యకరమైన వాఖ్యలు చేసి… తిరిగి ఆ వ్యాఖ్యలు ఖండించిన సినీ ప్రముఖులపై పరువు నష్టం దావా వేసిన కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్ వేదికగా నటి త్రిషపై మన్సూర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. పబ్లిక్‌లో ఎలా మాట్లాడాలో తిరిగి తనకు తెలుసనడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. తరచూ వివాదాల్లో నిలుస్తూ… తిరిగి తనని తాను అమాయకుడినని చెప్పుకోవడం మన్సూర్(Mansoor Ali Khan) కు సరికాదన్నారు. ఈ కేసులో మన్సూర్‌పై త్రిష నమోదు చేయాలని తెలిపింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు మన్సూర్ వ్యాఖ్యలకు సంబంధించిన అన్‌కట్ వీడియోను త్వరలోనే న్యాయస్థానానికి అందజేస్తానని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అలాగే, త్రిష, ఖుష్బూ, చిరంజీవి కూడా తమ వాదనలు వినిపించాలని న్యాయమూర్తి తెలిపారు. ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు.
Mansoor Ali Khan – త్రిష, మన్సూర్ ల వివాదానికి కారణం ఏమిటంటే ?
స్టైలిష్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష జంటగా తెరకెక్కిన ‘లియో’ సినిమాలో నటించిన మన్సూర్ అలీఖాన్… ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో “గతంలో నేను ఎన్నో రేప్ సీన్లలో నటించాను. ‘లియో’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నాను. అయితే అలాంటి సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించింది” అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
దీనితో ‘లియో’ దర్శకుడు లోకేశ్ కనగరాజ్, ప్రముఖ హీరో చిరంజీవి, ఖుష్బూ నితిన్, రోజా, రాధిక, గాయని చిన్మయి వంటి పలువురు సినీ ప్రముఖులు మన్సూర్(Mansoor Ali Khan) వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్… ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి… మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు త్రిషకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నడిగర్ సంఘం మన్సూర్ ను పాక్షికంగా నిషేధం విధించింది.
దీనితో దిగొచ్చిన మన్సూర్ త్రిషకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు. అయితే చిరంజీవి, ఖుష్బూ, త్రిష వల్ల తన పరువుకు భంగం కలిగిందని మన్సూర్ మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేసారు. సోషల్‌మీడియా వేదికగా వాళ్లు చేసిన వ్యాఖ్యలు తనని ఎంతో బాధపెట్టాయని… కాబట్టి పరువు నష్టం క్రింద కోటి రూపాయలు పరిహారం ఇప్పించాలంటూ ఈ ముగ్గురిపై పరువు నష్టం దావా వేశారు.
Also Read : Hero Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’ కు డేట్ ఫిక్స్