Manjummel Boys: తెలుగులో మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ !

తెలుగులో మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ !

Manjummel Boys: మలయాళంలో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తాజా బ్లాక్‌ బస్టర్‌ సినిమా ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీనాథ్‌ భాసి, బాలు వర్గీస్‌, గణపత్‌, లాల్‌ జూనియర్‌, దీపక్‌ కీలక పాత్రల్లో నటించారు. మాలీవుడ్‌ లో మునుపెన్నడూ ఊహించని రేంజ్‌ లో భారీ బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ ను రాబట్టిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులోకి తీసుకొస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌(Manjummel Boys)’ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఫన్‌, సస్పెన్స్‌ తో పాటు సర్వైవల్ థ్రిల్లర్ గా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాను ఏప్రిల్‌ 6న తెలుగులో విడుదల చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే… కొడైకెనాల్‌లోని గుణ కేవ్స్‌లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించడం కోసం ఎర్నాకులం మంజుమ్మల్‌ బాయ్స్‌ చేసిన సాహసోపేతమైన ప్రయత్నమే ఈ చిత్ర కథాంశం. ఈ ఇతివృత్తాన్ని ట్రైలర్‌ లో ఉత్కంఠభరితంగా చూపించారు. ప్రధాన పాత్రల మధ్య స్నేహాన్ని చూపిస్తూ ప్రచార చిత్రం ఆసక్తికరంగా మొదలైంది. వారిలో ఒకరు గుహలోని లోతైన గుంటలో పడిపోవడం.. అతన్ని రక్షించేందుకు తోటి మిత్రులంతా ప్రయత్నాలు ప్రారంభించడం.. ఈ క్రమంలో ప్రభుత్వ బృందాలు రంగంలోకి దిగడం.. వారికి ఎదురయ్యే సవాళ్లతో ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

Manjummel Boys – ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ కథేమిటంటే ?

కొచ్చిలోని ఓ స్నేహితుల బృందం కొడైకెనాల్‌ ట్రిప్‌ నకు వెళ్తుంది. అక్కడి విశేషాలను తెలుసుకునే క్రమంలో ‘గుణ గుహ’ గురించి తెలుస్తుంది. కమల్‌ హాసన్‌ ‘గుణ’ మూవీ అక్కడే తీశారని తెలియడంతో స్నేహితులందరూ అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్‌ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్‌ అందరూ ఓ గుహలోకి వెళ్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇంకా లోపలికి వెళ్తారు. ఓ పాయింట్‌ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడి రాళ్లపై ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ అని రాస్తారు.

ఈ క్రమంలో సుభాష్‌ అనే ఓ స్నేహితుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. సుభాష్‌ ఏదో సరదాకు అలా చేశాడని అందరూ తొలుత అనుకుంటారు. కానీ, ఎన్నిసార్లు పిలిచిన మాట రాకపోయే సరికి భయపడి బయటకు వచ్చేస్తారు. అతడిని కాపాడేందుకు సహాయబలగాలు సైతం చేతులెత్తేస్తాయి. కానీ వారి స్నేహితులు మాత్రం అతడిని అలా వదిలేసి పోవడానికి ఇష్టపడరు. మరి తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చేసిన సాహసం ఏంటి ? అన్నది కథ. ఈ కథను సర్వైవల్ డ్రామాగా దర్శకుడు చిదంబరం చాలా ఆశక్తికరంగా తెరకెక్కించారు.

Also Read : SS Rajamouli: ప్యామిలీ ఫంక్ష‌న్‌లో స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన రాజ‌మౌళి దంపతులు !

Manjummel Boysmytri movies makers
Comments (0)
Add Comment