Manjummel Boys: ఇళయరాజా లీగల్‌ నోటీసులపై స్పందించిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ నిర్మాత !

ఇళయరాజా లీగల్‌ నోటీసులపై స్పందించిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ నిర్మాత !

Manjummel Boys: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పంపించిన లీగల్ నోటీసులపై ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ నిర్మాత షాన్ ఆంటోనీ స్పందించారు. ఇటీవల ఓ న్యూస్ పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వూలో షాన్ ఆంటోనీ మాట్లాడుతూ… కాపీరైట్‌ కలిగిన రెండు మ్యూజిక్‌ కంపెనీలను సంప్రదించి వారినుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పాటను వాడామని ఇయన స్పష్టం చేసారు. అయితే ఈ విషయంలో ఇళయరాజా వాదన మరోలా ఉంది. ఆ పాటకు మ్యూజిక్‌ కంపోజర్‌ కావడం వల్ల తనకే మొదటి ఓనర్‌ రైట్స్‌ ఉంటాయని అంటున్నారు. తన పనికి సంబంధించిన ప్రతీ మ్యూజిక్‌ బిట్‌ పైనా హక్కులు తనకే చెందుతాయని చెబుతున్నారు. మంజుమ్మెల్‌ బాయ్స్‌ చిత్రబృందం తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనితో ఇళయరాజా లీగల్‌ నోటీసుల వ్యవహారం మరోసారి చిత్ర పరిశ్రమలో వార్తల్లో నిలిచింది.

Manjummel Boys….

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా… తన అనుమతి లేకుండా ‘గుణ’లోని పాటను సినిమాలో వాడారంటూ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌(Manjummel Boys)’ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఆ పాటకు మ్యూజిక్‌ కంపోజర్‌ కావడం వల్ల తనకే మొదటి ఓనర్‌ రైట్స్‌ ఉంటాయని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. తన పనికి సంబంధించిన ప్రతీ మ్యూజిక్‌ బిట్‌ పైనా హక్కులు తనకే చెందుతాయని చెబుతున్నారు. కాబట్టి మంజుమ్మెల్‌ బాయ్స్‌ చిత్రబృందం తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా కాపీరైట్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా తన పాటను ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా గతంలోనూ ఓ సినిమాలోని పాటను మరో సినిమాలో వినియోగించడంపై న్యాయపరంగా వాదోపవాదాలు నడిచాయి. మ్యూజిక్‌ కంపెనీలు ఎన్ని సంవత్సరాలైతే హక్కులు కలిగిఉంటాయో అన్నేళ్లు వాటికే చెందుతాయి తప్ప… ఆ పాటలను కంపోజ్‌ చేసిన సంగీత దర్శకుడికి ప్రత్యేకంగా హక్కులంటూ ఉండవని న్యాయస్థానం ఓ సందర్భంలో అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇళయరాజా పంపించిన లీగల్ నోటీసుల వ్యవహారం మరోసారి చిత్ర పరిశ్రమల్లో సంచలనంగా మారింది.

Also Read : Akshay Kumar: 200 గుర్రాలతో అక్షయ్ కుమార్ భారీ యాక్షన్‌ సీక్వెన్స్ !

ilayarajaManjummel Boys
Comments (0)
Add Comment