Manjummel Boys : మాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రస్తుతం పీక్‌లో ఉంది. ఇటీవల విడుదలైన ‘బ్రహ్మ యుగ’, ‘ప్రేమలు’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. తాజాగా ‘మంజుమ్మేల్ బాయ్స్’ చరిత్ర సృష్టించింది. ఫిబ్రవరి 22న విడుదలైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ 100 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో మలయాళ చిత్రంగా నిలిచింది. గతంలో పులిమురుగన్ మరియు లూసిఫర్ చిత్రాలు 2018లో రూ. 100 కోట్లకు పైగా వసూలు చేశాయి.
Manjummel Boys Movie Updates
చిదంబరం డైరేక్షన్ లో విడుదలైన ‘మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys)’ 12 రోజుల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టింది. 2024లో మంజుమ్మేల్ బాయ్స్ 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మలయాళ చిత్రంగా నిలిచింది. తమిళనాడులో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. మంజుమ్మేల్ బాయ్స్ తమిళనాడులో బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల మార్కును దాటిన మొదటి మలయాళ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఉంది కాబట్టి మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.
సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బస్సీ, బాల్ వర్గీస్, గణపతి ఎస్ పొదువాల్, లాల్ జూనియర్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ‘మంజుమ్మేల్ బాయ్స్’ చిత్రాన్ని పరవ ఫిల్మ్స్ నిర్మించింది. సుసిన్ శ్యామ్ సంగీతం సమకూర్చారు. తమిళనాడులోని కొడైకెనాల్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కొడైకెనాల్‌కు వెళ్లిన స్నేహితుల కథనం, అక్కడ వారు ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
Also Read : Ram Charan : అంబానీ ప్రీ వెడ్డింగ్ లో షారుఖ్ ఖాన్ చెర్రీని అవమానించాడా..?