Mani Ratnam: అభిమానులకు ‘మణిరత్నం’ క్లాస్

అభిమానులకు 'మణిరత్నం' క్లాస్

Mani Ratnam : భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘మణిరత్నం’. రోజా, బొంబాయి, గీతాంజలి, దిల్ సే, యువ, రావన్, వంటి ఎన్నో తెలుగు, తమిళ, హిందీ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకులతో మణిరత్నం(Mani Ratnam) సినిమా అంటే అన్ని భాషల్లో కూడా ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ చిత్రాలతో ఇటీవల భారీవిజయాలను అందుకున్న మణిరత్నం… ప్రస్తుతం కమల్‌హాసన్‌ హీరోగా ‘థగ్‌ లైఫ్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. త్రిష కథానాయికగా దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు. అయితే ఇటీవల ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా హీరోల అభిమానుల మధ్య తరచూ తలెత్తుతున్న వివాదాలకు సంబందించి కీలక వ్యాఖ్యలు చేసారు.

Mani Ratnam – ఫ్యాన్స్ వార్ పై ‘మణి’ స్పెషల్ క్లాస్

‘‘సామాజిక మాధ్యమాల వేదికగా ఎవరెవరో ఏవోవో కామెంట్స్‌ చేస్తుంటారు. ఎదుటివ్యక్తులను దూషించడానికే వారు ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగిస్తుంటారు. నాకు ఆ హీరో అంటే ఇష్టం. నాకు ఈ హీరో అంటే ఇష్టం అంటూ వాదనలకు దిగుతారు. అలాంటి వాదనలకు దిగడంలో ఎలాంటి అర్థం లేదు. అక్కడ జరిగే చర్చలు రోడ్‌ సైడ్‌ డిబేట్స్‌లా ఉంటాయి. అవసరమైన విషయాలపై ఏదైనా చర్చలు జరిగితే పర్వాలేదు కానీ… తమ హీరోల కోసం అభిమానులు ఒకరినొకరు దూషించుకోవడం దారుణం ’’ అంటూ ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఫ్యాన్స్ వార్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న సోషల్ మీడియా

ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా ఈ మధ్యకాలంలో తరచూ అభిమానుల మధ్య వార్‌ జరుగుతోంది. మా హీరో గొప్ప అని కొంతమంది అంటే.. లేదు మా హీరోనే గొప్ప అని ఇంకొంత మంది పోస్టులు పెడుతున్నారు. కొన్నిసార్లు మితిమీరి అసభ్యపదజాలంతోనూ దూషించుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే చాలామంది స్టార్‌హీరోలు స్పందించారు. ‘మేమంతా ఒక్కటే.. సినిమాల పరంగా మా మధ్య పోటీ ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా మా మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కలిసి ఉండండి’ అని ఎన్నోసార్లు చెప్పారు. అయినా సరే అభిమానులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

Also Read : Leo: ఓటీటీలోకి ‘లియో’… డేట్ ఫిక్స్ చేసిన నెట్ ఫ్లిక్స్…

mani ratnam
Comments (0)
Add Comment