Ajay Bhupathi : నయా ప్రాజెక్టుతో సిద్దమైన ‘మంగళవారం’ డైరెక్టర్

మంగళవారం లాంటి థ్రిల్లర్ హిట్ తరువాత డైరెక్టర్ అజయ్ భూపతి....

Ajay Bhupathi : అజయ్ భూపతి ‘RX 100’ రిలీజై అప్పట్లో ఎంత క్రేజి విక్టరీ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక 2023లో ఆయన పాయల్ రాజపుత్ తో రెండో సారి జత కట్టి తీసిన ఎరోటిక్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘మంగళవారం’ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే ఈ ఏడాది భారత్ తరపున ఆస్కార్‌కి నామినేట్ చేసే సినిమాల జాబితాలో ఈ మూవీని పరిశీలించినా.. ఆ అదృష్టం మాత్రం బాలీవుడ్ ఫిల్మ్ ‘లాపతా లేడీస్‌’ మూవీనే వరించింది. కాగా నెక్స్ట్ అజయ్ భూపతి.. ధృవ్ విక్రమ్‌తో ఒక బైలింగ్వల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడని వార్తలొచ్చాయి. కానీ.. అజయ్(Ajay Bhupathi) మాత్రం తొందర్లోనే వేరే హీరోతో ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

Ajay Bhupathi Movie Updates

మంగళవారం లాంటి థ్రిల్లర్ హిట్ తరువాత డైరెక్టర్ అజయ్ భూపతి.. పెదకాపు ఫేమ్ హీరో విరాట్ కర్ణతో ఒక రూటెడ్, రగ్డ్, ఎమోషనల్, లవ్, యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా షూట్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే తమిళ్ యంగ్ సెన్సేషన్ ధృవ్ విక్రమ్ తో ఒక బైలింగ్వల్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఆ వార్తల్లో నిజమున్న.. మూవీ ఆగిపోయినట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఎంతో ఎక్సైట్ అయినా ఫ్యాన్స్ ఇప్పుడు కాస్త డీలా పడ్డారు. అయితే విరాట్ కర్ణతో చేస్తున్న ప్రాజెక్ట్‌తో అజయ్ మళ్ళీ ఎం మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి. మరోవైపు పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో బోల్డ్ కథాంశంతో అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మంగళవారం’. అన్ని వర్గాల ప్రేక్షకులని, విమర్శకులని, తెలుగు పరిశ్రమ దిగ్గజాలని కూడా ఆకట్టుకుని థియేటర్లలో భారీ విజయంతో కంటెంట్ ఉన్న చిత్రాల బలం చూపించింది ఈ చిత్రం. జాతీయ, అంతర్జాతీయ వీక్షకుల నుండి ఓటీటీలో కూడా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది.

Also Read : Trivikram Srinivas : విజయ్ ప్రేమ ఎంత చూశాడో ద్వేషం అంతకు మించి చూసాడు

Ajay BhupathiMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment