Mandira Bedi- Shocking Comment :నీ జ్ఞాప‌కం ప‌దిలం జీవితం భారం

న‌టి మందిరా బేడి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Mandira Bedi : వ‌ర్ద‌మాన న‌టి మందిరా బేడి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌ను ప్రాణ‌ప్రదంగా ప్రేమించిన దివంగ‌త భ‌ర్త రాజ్ కౌశ‌ల్ త‌న నుంచి దూరం కావ‌డాన్ని ప్ర‌త్యేకంగా గుర్తు చేసుకుంది. జీవితంలో విషాదం ఏమిటంటే త‌న‌ను కోల్పోవ‌డం. తాను క‌ల‌లో కూడా అనుకోలేద‌ని వాపోయింది.

Mandira Bedi Shocking Comments

కాలం ఎంత విచిత్రం క‌దూ క‌లిసిన మ‌న‌సుల‌ను విడ‌దీస్తుంది. విడి పోయిన హృద‌యాల‌ను క‌లుపుతుందంటూ పేర్కొంది. లైఫ్ సో మ‌చ్ బ్యూటిఫుల్ అంటూ త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను తెలియ చేసింది. నిజంగా ఈ జ‌ర్నీ కీల‌క‌మైన‌ది. త‌న‌ను మ‌రింత జఠిలం అయ్యేలా చేసిందంటూ స్ప‌ష్టం చేసింది మందిరా బేడి(Mandira Bedi).

త‌ను లేని లోటు పూడ్చ లేనిది. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ త‌న‌ను మ‌రిచి పోలేను. ఎందుకంటే నా జీవితంలో అనుకోకుండా వ‌చ్చాడు. ఊహించ‌ని బంధం మా ఇద్ద‌రి మ‌ధ్య నెల‌కొంది. ఇద్ద‌రం క‌లిసి ఎన్నో అనుభ‌వాల‌ను పంచుకున్నాం. ఈ ప్ర‌యాణం మ‌మ్మ‌ల్ని మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేలా చేసింది. ఈ జ‌ర్నీలో క‌న్నీళ్లు ఉన్నాయి. అంత‌కంటే క‌ల‌బోతలు కూడా ఉన్నాయి. వీటిన్న‌టి వెనుక నిగూఢ‌మైన అర్థం దాగి ఉంది. అది అద్వితీయ‌మైన ప్రేమ‌.

అందుకే త‌నంటే నాకు పంచ ప్రాణం. మ‌నుషుల మ‌ధ్య బంధం అనేది బ‌ల‌ప‌డితే అది మ‌రింత హ‌త్తుకునేలా చేస్తుంది. చివ‌రి కాదా త‌లుచుకునేలా చేస్తుందంటూ పేర్కొంది. ఈ సంద‌ర్బంగా త‌న భ‌ర్త గురించి మందిరా బేడి చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Also Read : సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలెగావ్ పై ఆస‌క్తి

CommentsMandiraShockingViral
Comments (0)
Add Comment