Vaani Kapoor : ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ సీరీస్ కోసం బిజీగా మారింది వాణి కపూర్. మండల మర్డర్స్ పేరుతో సీరీస్ తయారవుతోంది. దీనిని థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు. ఈ ఏడాదే విడుదల కానుంది. దీనికి దర్శకుడు గోపి పుత్రన్. షూటింగ్ ఏ ఏడాది ప్రారంభంలో ముగిసినప్పటికీ చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు. కొన్ని సన్నివేశాలను మరింత మెరుగు పరిచేందుకు దర్శకుడు దృష్టి సారించారు.
Vaani Kapoor Web Series
మందల మర్డర్స్ సీరీస్ లో కీలకమైన రోల్ పోషిస్తోంది వాణి కపూర్(Vaani Kapoor ). ఇందులో హత్యల పరంపరను విప్పే డిటెక్టివ్ గా నటించారు. యాక్షన్, సంక్లిష్టమైన కథనంతో ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు గా రూపొందుతోంది. మరింత ఉత్కంఠ రేపేలా ప్రేక్షకులను ఆలోచింప చేసేలా డైరెక్టర్ మరింత ఫోకస్ పెట్టారు.
మాధ్ ద్వీపంలో చిత్రీకరణ చేపట్టారు. కీలకమైన సన్నివేశాలు మరింత బాగా రావాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు దర్శకుడు గోపి పుత్రన్. నెట్ ఫ్లిక్స్ సీరీస్ లో వాణి కపూర్ తో పాటు వైభవ్ రాజ్ గుప్తా, జమీల్ ఖాన్, సుర్వీన్ చావ్లా , తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సీరీస్ డిటెక్టివ్ లు రియా థామస్, విక్రమ్ సింగ్ లను అనుసరిస్తోంది సీరీస్.
చరణదాస్‌పూర్ అనే భయంకరమైన గ్రామంలో శతాబ్దాలుగా వృద్ధి చెందుతున్న రహస్య సమాజంతో ముడిపడి ఉన్న ఆచార హత్యల చిరాకు పుట్టించే రహస్యాన్ని విప్పేందుకు ప్రయత్నం చేశారు వాణి కపూర్.
Also Read : Chhaava Success :ఛావా సెన్సేషన్ వసూళ్లలో ధనా ధన్