Manchu Vishnu: హీరోహీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48గంటల్లో తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్‌కు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్ వీడియోలను డిలీట్ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఓ తండ్రి-కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్ట్ చేసిన యూట్యూబర్లపై విష్ణు మండిపడ్డారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోబోమన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
Manchu Vishnu Comment
ఆ వీడియోలో మంచు విష్ణు మాట్లాడుతూ… సోషల్ మీడియాలో డార్క్ కామెడీ పేరుతో నటీనటులపై ట్రోలింగ్ చేస్తూ ఎవరైనా వీడియోలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రపంచంలో తెలుగు వాళ్లకు మంచి పేరు ఉంది. కానీ ఈ మధ్య కొంత మంది సోషల్ మీడియాలో డార్క్ కామెడీ, ఫన్నీ ట్రోలింగ్ వీడియోలతో చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆయన అన్నారు. కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం సరికాదని విష్ణు(Manchu Vishnu) సూచించారు.
అంతేకాదు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్లపై సైబర్ సెక్యూరిటీ వాళ్లకు పిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇకనుంచి సోషల్ మీడియాలో ఉన్న వారందరూ తమ తీరును మార్చుకోవాలని మంచు విష్ణు కోరారు. సోషల్ మీడియాలో ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు మంచు విష్ణు అప్పీల్ చేశారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తండ్రీ కుమార్తెకు సంబంధంచిన ఓ వీడియోపై రోస్ట్ వీడియోలు చేసే ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న ప్రణీత్ హనుమంతు తీరుపై టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ మొదటిసారి రియాక్ట్ అయ్యాడు. ఆయన తీరును తప్పుబడుతూ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని షేర్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ అయింది. ఇలాంటి చిల్లర కామెంట్లు చేస్తున్న వ్యక్తుల గురించి తాజాగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు.
Also Read : Urvashi Rautela: షూటింగ్‌లో గాయపడ్డ ఊర్వశీ రౌతేలా !