Manchu Vishnu : మంచు కుటుంబం అతి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్‌లాల్, శరత్ కుమార్, శివరాజ్‌కుమార్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కీచా ఖామ్‌ఫక్డీ రంగంలోనికి దించారు. సుమారు ఐదు నెలలుగా న్యూజీలాండ్ లో ఈ సినిమా షూటింగ్ జరుతోంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు(Manchu Vishnu) పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Manchu Vishnu – ఫస్ట్ లుక్ తో పాటు క్యాప్షన్ ను పోస్ట్ చేసిన మంచు విష్ణు
హీరో ముఖం కనిపించకుండా శివలింగం వైపు ఓ యోధుడు విల్లు ఎక్కుపెట్టినట్లు ఉన్న ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ ను మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ ఫోస్టర్ ను షేర్ చేసిన మంచు విష్ణు ‘కన్నప్ప’ ప్రపంచంలోకి అడుగుపెట్టండి అంటూ క్యాప్షన్ ను జోడించారు. అంతేకాదు ఒక నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారాడన్నది ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ పోస్టర్ చూసిన వారంతా పాన్ ఇండియా సినిమా స్థాయికి సరిపోయే విధంగా ఫస్ట్ లుక్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Rread : Naga Chaitanya: ఆశక్తికరంగా నాగచైతన్య ‘దూత’ ట్రైలర్