Manchu Vishnu: నిరుపేద కళాకారులకు రూ.10 లక్షలు విరాళం ప్రకటించిన మంచు విష్ణు !

నిరుపేద కళాకారులకు రూ.10 లక్షలు విరాళం ప్రకటించిన మంచు విష్ణు !

Manchu Vishnu: ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. నిరుపేద కళాకారులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన కుమార్తె ఐరా విద్య పుట్టిన రోజు సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి పది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. మా అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం ఈ పది లక్షలు ఖర్చు చేయనున్నారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. దీనితో మంచు విష్ణు నిరుపేద కళాకారులకు ప్రకటించిన విరాళంపై సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Manchu Vishnu Helps

ప్రస్తుతం మంచు విష్ణు(Manchu Vishnu) తన ఫ్యామిలీ డ్రీం ప్రాజెక్టు కన్నప్ప కోసం వర్క్‌ చేస్తున్నారు. బాలీవుడ్ లో రామాయణను తెరకెక్కించిన ముకేశ్‌ కుమార్‌సింగ్‌ ఈ సినిమాకు దర్శకుడు. మంచు ఫ్యామిలీ కెరీర్ లో అతి భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో ప్రభాస్, అక్షయ్‌ కుమార్‌, శరత్‌కుమార్‌, మోహన్‌లాల్‌, ప్రీతి ముకుందన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం న్యూజిలాండ్‌ లోనే షూటింగ్‌ జరిగింది. మోహన్‌ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా టీజర్‌ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రదర్శితమైన సంగతి తెలిసిందే. ఇటీవల సోషల్‌ మీడియాలోనూ విడుదలై, ప్రేక్షకులను అలరించింది.

మరోవైపు గత మూడేళ్లుగా మంచు విష్ణు(Manchu Vishnu) మా అధ్యక్షుడిగా కొనసాగుతూ… అసోసియేషన్ మెంబర్లకు అండగా నిలుస్తున్నాడు. సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్‌ను కట్టడి చేసేందుకు నడుంబిగించారు.నటులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్‌లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారు. విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది.

Also Read : Pawan Kalyan-OG : ఓజీ సెట్స్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..?

KannappaManchu VishnuMovie Artists Association
Comments (0)
Add Comment