Manchu Manoj Shocking :బ‌డ్జెట్ కంటే సినిమాలో ద‌మ్ముండాలి

న‌టుడు మంచు మ‌నోజ్ షాకింగ్ కామెంట్స్

Manchu Manoj : మంచు మోహ‌న్ బాబు, విష్ణుల‌పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు న‌టుడు మంచు మ‌నోజ్(Manchu Manoj). ఆస్తుల విష‌యంలో ఇంకా త‌గాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఓ మూవీ టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ లో త‌ను పాల్గొని ప్ర‌సంగించాడు. జీవితంలో త‌న‌ను చాలాసార్లు తొక్కాల‌ని చూశార‌ని, అంతే కాకుండా ఆధారాలు లేకుండా బుర‌ద చ‌ల్లేందుకు ప్ర‌య‌త్నం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏం చేసినా ప్రేక్ష‌కుల గుండెల్లో నుంచి త‌న‌ను ఎవ‌రూ తీసి వేయ‌లేర‌న్నారు మంచు మ‌నోజ్.

Manchu Manoj Shocking Comments

ప్రేక్ష‌కులే త‌న కుటుంబ‌మ‌ని, మీరే నాకు దేవుళ్లంటూ కొనియాడారు. త‌న‌ను తొక్కాల‌న్నా లేదా లేపాల‌న్నా మీ వ‌ల్లే అవుతుంది తప్ప ఇంకెవ్వ‌డి వ‌ల్ల కాద‌ని హెచ్చ‌రించారు. త‌న కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు తాను ధ‌ర్మం, న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు మంచు మనోజ్.

తాను ఒంట‌రి వాడిన‌ని వాళ్లు అనుకుంటున్నార‌ని, త‌న‌కు కూడా వారి కంటే ఎక్కువ బ‌ల‌గం ఉంద‌ని తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. ప‌రోక్షంగా మంచు విష్ణు, క‌న్న‌ప్ప మూవీపై పంచ్ లు వేశారు. సినిమా బ‌డ్జెట్ ఎంత అనేది ఎవ‌రూ చూడ‌ర‌ని, సినిమాలో ద‌మ్ముందా లేదా అని చూస్తార‌న్నారు. తాను చెట్టు పేరు చెప్పుకుని కాయ‌లు అమ్ముకునే ర‌కం కాద‌న్నాడు.

Also Read : CM Chandrababu- Sensational :ప్రాజెక్టుల ప‌నులు ఆల‌స్యం సీఎం ఆగ్ర‌హం

BreakingCommentsKannappaManchu ManojShockingViral
Comments (0)
Add Comment