Manchu Manoj: సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలు బుధవారం తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ లో ఘనంగా నిర్వహించారు. మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రత్యేక అతిథిగా హాజరయిన ఈ వేడుకకి మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్(Manchu Manoj) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు మరికొన్ని రోజుల్లో ఏపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయా వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తున్నాయి.
Manchu Manoj – మంచు మనోజ్ ఏమన్నారంటే ?
మంచు మనోజ్ ఫలానా వ్యక్తికి ఓటు వెయ్యండి… ఫలాన వ్యక్తికి ఓటు వేయ్యొద్దు అని చెప్పకుండా… రాజకీయాలపై తనదైన రీతిలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పది మందిని కలుపుకుని వెళ్లే నాయకుడిని వెతుక్కోండి… అలాగే అవగాహనతో కరెక్ట్ లీడర్ ను ఎన్నుకోండి అని అన్నారు. సొంతం కుటుంబానికి గానీ… చుట్టుపక్కల వాళ్ళకి గానీ సహాయం చేయలేని… వాళ్లు ఇంకా ప్రజలకు ఏమి సహాయం చేస్తారు. ఓటు వేసేటప్పుడు ఈ అంశాలను గుర్తు పెట్టుకుని ఏ నాయకుడుకి ఓటేస్తే… పేదలకు న్యాయం జరుగుతుందో వారికి ఓటు వేయండి అంటూ హితవు పలికారు. అంతేకాదు డబ్బులు ఎక్కువ ఉండి నాయకులు ఇస్తే తీసుకోండి… కానీ ఓటు మాత్రం మీకు నచ్చిన వాళ్లకు మాత్రమే వెయ్యండి అని అన్నారు. అందరిని కలుపుకుని వెళ్లే వాడే అసలైన నాయకుడు… ఓటును డబ్బుకు అమ్ముకోకండి… అతను మంచి నాయకుడా కాదా పరిశీలించి ఓటు వెయ్యండి అని అన్నారు. ప్రస్తుతం మనోజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అయితే మంచు మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి… మాజీ మంత్రి, టీడీపీ ఆళ్ళగడ్డ అసెంబ్లీ అభ్యర్ధి భూమా అఖిల ప్రియ సోదరి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఇది ఇలా ఉండగా మంచు మోహన్ బాబు కుటుంబం గత ఎన్నికల్లో వైసీపీకు మద్దత్తుగా నిలిచారు. ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయలేదంటూ అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ధ ఎత్తున ధర్నా నిర్వహించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత కూడా ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల కాకపోవడం వలన ఆస్తులు అమ్మి కాలేజీ స్టాఫ్ జీతాలు చెల్లిస్తున్నామంటూ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మోహన్ బాబు స్వయంగా చెప్పారు.
Also Read : Amala Paul: ట్విన్స్ కు జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్ ?