Manchu Manoj : మనోజ్ ఫిర్యాదు పై సంచలన వ్యాఖ్యలు చేసిన తల్లి నిర్మల

డిసెంబర్‌8 ఆదివారం మంచు కుటుంబంలో విభేదాలు రోడ్డున పడిన సంగతి తెలిసిందే...

Manchu Manoj : మంచు ఫ్యామిలీ గొడవల్లో ట్విస్టుల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా తెరపైకి వచ్చిన వివాదంలో మనోజ్ చెబుతోంది అబద్ధమంటూ తల్లి నిర్మల క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఇంట్లో విష్ణు ఎలాంటి గొడవ చేయలేదంటూ స్పష్టం చేశారు. పహాడీ షరీఫ్‌ పోలీసులకు మోహన్‌బాబు భార్య నిర్మలాదేవి లేఖ రాశారు. తన పుట్టిన రోజు ఎలాంటి గొడవ జరగలేదంటూ అందులో చెప్పుకొచ్చారు. ఆరోజు ఇంట్లోని జనరేటర్‌లో విష్ణు పంచదార పోశారంటూ మనోజ్ చేసిన ఆరోపణలను తల్లి నిర్మల ఖండించారు. తన పుట్టినరోజున కేక్‌ తీసుకుని సెలబ్రేట్ చేసేందుకే విష్ణు వచ్చాడని, కేక్‌ కట్‌ చేశాక తన సామాన్లు మాత్రమే తీసుకుని వెళ్లాడని చెప్పారు నిర్మాల దేవి. చిన్న కొడుకు మనోజ్‌(Manchu Manoj)కి ఇంట్లో ఎంత హక్కు ఉందో.. పెద్ద కొడుకు విష్ణుకి కూడా అంతే హక్కు ఉందన్నారు నిర్మల. విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని స్పష్టంగా చెప్పారు. ఇంట్లో పనివాళ్లు మానేయడానికి విష్ణు కారణం కాదని వాళ్లే పనిచేయలేమని మానేశారు అంటూ వివరణ ఇచ్చారు నిర్మలదేవి.

Manchu Manoj Family Issues..

డిసెంబర్‌8 ఆదివారం మంచు కుటుంబంలో విభేదాలు రోడ్డున పడిన సంగతి తెలిసిందే.తండ్రి మోహన్‌బాబు.. చిన్న కొడుకు మనోజ్‌ మధ్య మాటామాటా పెరిగి.. తోపులాటలకు దారి తీసి చివరికి కేసులు పెట్టుకునే వరకూ వెళ్లింది. ఈ వివాదాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన టీవీ9 రిపోర్టర్‌ సహా మిగతా మీడియాపై మోహన్‌బాబు దాడితో వివాదం ఇంకా పెద్దదైంది. పరస్పరం దాడులు, మాటల యుద్ధంతో విష్ణు, మనోజ్‌ రగిలిపోయారు. ఇదిలా కొనసాగుతుండగానే 14వ తేదీన, అంటే గత శనివారం తల్లి నిర్మల బర్త్‌డే సందర్భంగా మనోజ్‌, విష్ణు మళ్లీ గొడవ పడ్డారనే వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. ఆరోజు జనరేటర్‌లో పంచదార పోయడం ద్వారా కరెంట్ లేకుండా చేశారని మనోజ్ తన అన్న విష్ణుపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Also Read : Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాటలో వెలుగులోకి సంచలన నిజాలు

Manchu ManojUpdatesViral
Comments (0)
Add Comment