Manchu Laxmi Prasanna: సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సెలబ్రెటీ స్టాటస్ ను ఎంజాయ్ చేస్తున్న నటి మంచు లక్ష్మీ ప్రసన్న. మోహన్ బాబు వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లక్ష్మీ ప్రసన్న… హీరోయిన్ గా రాణించలేకపోయినప్పటికీ… వ్యాఖ్యాతగా ముఖ్యంగా ఇంగ్లీషును ఒక రకమైన యాసతో మాట్లాడటంలో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం సినిమాలకు కాస్తా దూరంగా ఉన్నప్పటికీ… సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. అయితే మంచు లక్ష్మి(Manchu Laxmi Prasanna) ఒక్కసారిగా తన సోషల్ మీడియాలో విధ్వంసాన్ని రాజేసింది. స్టార్ హీరోయిన్లే కుళ్లుకునేలా గ్లామర్ ప్రదర్శనతో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి.
Manchu Laxmi Prasanna Photos Viral
ఆ మధ్య ఆవార్డ్ ఫంక్షన్స్ లో తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అభిమానులు నోరెళ్ల బెట్టేలా చేసిన మంచు లక్ష్మి… నెల రోజుల క్రితం ఓ మంచు ప్రదేశంలో బికినీలో నీళ్లలోకి దిగి రచ్చ చేసింది. ఇవన్నీ మరువక ముందే తాజాగా మరోసారి అదే స్థాయిలో గ్లామర్ ఒలకబోస్తూ చేసిన ఫొటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కాక రాజేస్తోంది. An Ode To The Oscars అంటూ క్యాప్సన్ పెట్టి మంచు లక్ష్మి ఈ ఫొటోలను తన సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేయగా క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అసలు ఈ స్నో అక్కకు ఏమైంది ఈ మధ్య ఇలా తెగించేస్తోంది అని కొందరు… ముంబై వెళ్లి పోయాక పూర్తిగా మారి పోయిందని… లచ్చక్క నువ్వు ఇక్కడ కాదు హాలీవుడ్ కు వెళ్లాలి… ఆస్కార్ తీసుకోవాలి అంటూ తమదైన శైలిలో మీమ్స్… కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Konidela Upasana: ‘ఒక కల నెరవేరిన వేళ’ అంటూ ఉపాసన ఎమోషనల్ పోస్ట్ !