Manchu Laxmi: నాగలాపురం నాగమ్మగా మంచు లక్ష్మి !

నాగలాపురం నాగమ్మగా మంచు లక్ష్మి !

Manchu Laxmi: సంజీవ్ మేగోటి దర్శకత్వంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘ఆదిపర్వం’. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ మరియు ఎ. వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగలాపురం నాగమ్మగా మంచులక్ష్మి కనిపించనున్నారు. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియడ్ డ్రామా, కథా నేపథ్యం ఉన్న ఈ సినిమాలో ఆదిత్య ఓం, ఎస్తర్ నొరోన్హా, శ్రీజిత ఘోష్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరుంధతి, అమ్మోరు సినిమాల తరహాలో హై టెన్షన్ యాక్షన్ ఫిలింగా రూపొందిస్తున్న ఈ సినిమాను దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ‘ఆదిపర్వం’ సినిమాలో నాగలాపురం నాగమ్మగా కనిపించనున్న మంచులక్ష్మి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో మంచులక్ష్మి… మోకాలి వరకు చీరను కట్టి.. నుదుటన పెద్ద బొట్టు పెట్టి చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Manchu Laxmi New Look

‘ఆదిపర్వం’ సినిమాలో నాగలాపురం నాగమ్మగా కనిపించనున్న మంచులక్ష్మి(Manchu Laxmi) ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ… ఈ సినిమాలో గ్రాఫిక్ వర్క్ హైలైట్ గా ఉంటుందన్నారు. అమ్మోరు, అరుంధతి చిత్రాల మాదిరిగా హై టెన్షన్ యాక్షన్ ఫిలింగా దక్షిణాది భాషలతోపాటు హిందీలో కూడా విడుదల చేస్తున్నామన్నారు. ఇటీవల విడుదలయి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న హనుమాన్ చిత్రం లాగే ఈ సినిమా కూడా అద్భుతమైన సక్సెస్ సాధిస్తుందని నాగలాపురం నాగమ్మ గా మంచులక్ష్మి నటవిశ్వరూపం చూడవచ్చని దర్శకుడు సంజీవ్ మేగోటి ఆశాభావం వ్యక్తం చేసారు.

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ “ఈ చిత్రంలో మంచులక్ష్మి పాత్ర చాలా గొప్పగా ఉంటుందని మంచులక్ష్మితోపాటు ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసినిలు తమతమ పాత్రల్లో విజృంభించారని… ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న గ్రాఫిక్స్ వర్క్ చివరిదశకు చేరుకుందని ఒక మంచి ప్రాజెక్టుని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మా దర్శకుడు సంజీవ్ మేగోటి అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. అలాగే చిత్రంలో నాగమ్మగా చేస్తున్న మంచులక్ష్మి ఎంతో రిస్క్ చేసి రెండు అద్భుతమైన ఫైట్స్ చేశారని… ఆ రెండు ఫైట్స్ సినిమాకి మరో హైలెట్ గా నిలుస్తాయన్నారు. క్షేత్ర పాలకుడిగా ప్రత్యేక పాత్ర చేస్తున్న శివకంఠంనేని కూడా చాలా అద్భుతంగా చేశారు” అని తెలిపారు.

Also Read : Singer Geetha Madhuri: వేడుకగా గాయని గీతామాధురి సీమంతం !

AadiparvamManchu Laxmi
Comments (0)
Add Comment