Manam: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మూడు తరాల నటులను అందించిన ఏకైక కుటుంబం అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం. 1970 దశకంలో అక్కినేని నాగేశ్వరరావు… తరువాత తరంలో అక్కినేని నాగార్జున… ప్రస్తుత తరంలో అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ఇలా మూడు తరాల నటులు తమ సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే యాదృచ్చికమో… ప్రణాళికో తెలియదు గాని మూడు తరాల నటులు కలిసి ఓ సినిమాలో నటించారు. అదే ‘మనం(Manam)’ సినిమా. 2014లో విడుదలైన ఈ సినిమా అక్కినేని కుటుంబ నటుల క్రేజ్ కు అతీతంగా… కథ, కథనం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమాలోని పాటలు, ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల, సమంత, సుమంత్ ఇలా మూడు తరాల నటులతో దాదాపు ఓ ఫ్యామీలీ ప్యాక్ గా విజయం సాధించి… తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమాగా ‘మనం’ నిలిచిపోయింది.
Manam Movie Special Show….
‘మనం’ సినిమా విడుదలై ఈ నెల 23కు పదేళ్ళు పూర్తికావడంతో… ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించింది. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘మనం’ సినిమా విడుదలై ఈ నెల 23తో పదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 23న ప్రత్యేక ప్రదర్శనల్ని నిర్వహిస్తున్నాము. ‘‘నా మనసులో ‘మనం’ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. పదేళ్ల వేడుకల్ని చేసుకోవడానికి, తిరిగి థియేటర్లోకి తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అంటూ నాగచైతన్య ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రియ కలిసి నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు.
Also Read : Ranveer Singh: గ్యాంగ్‌స్టర్ ‘ధురంధర్’ గా రణ్‌వీర్ సింగ్ !