Mamta Mohandas: కొత్త స్పోర్ట్స్‌ కారు కొన్న మమతా మోహన్‌ దాస్‌ !

కొత్త స్పోర్ట్స్‌ కారు కొన్న మమతా మోహన్‌ దాస్‌ !

Mamta Mohandas: టాలీవుడ్ లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లలో మమతా మోహన్‌ దాస్‌ ఒకరు. నటిగా, సింగర్ గా ఆమె తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. హీరోయిన్‌గా, సెకండ్‌ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఈమె… ‘రాఖీ రాఖీ రాఖీ.. నా కవ్వసాఖీ’, ‘ఆకలేస్తే అన్నం పెడతా..’ మంచి సింగర్ గా కూడా గుర్తింపుతెచ్చుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “యమదొంగ” సినిమాలో అబ్బయా.. అబ్బయా అంటూ జూనియర్ ఎన్టీఆర్ ను ముప్పతిప్పలు పెట్టిన ధనలక్ష్మిగా మమతా అందరికీ గుర్తుంది.

ఆ తరువాత ఈమె తెలుగులో కృష్ణార్జున, విక్టరీ, చింతకాయల రవి, కింగ్‌, కేడి ఇలా అనేక సినిమాలు చేసినప్పటికీ… మమతా మోహన్ దాస్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే సినిమా యమదొంగ మాత్రమే. మమతా మోహన్‌ దాస్ కు యమదొంగతో వచ్చినంత క్రేజ్‌ మరే చిత్రానికీ రాలేదు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈమె యాక్ట్‌ చేసినా మలయాళంలో ఎక్కువ సినిమాలు చేయడంతో అక్కడే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Mamta Mohandas Viral

2010లో హాడ్కిన్స్ లింఫోమా అనే ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడిన మమతా(Mamta Mohandas)… ధైర్యంగా పోరాడి… ఆ వ్యాధిని జయించింది. దీనితో మళ్లీ సినిమాపై ఫోకస్ పెట్టింది. దాదాపు పదేళ్ళపాటు తెలుగు సినిమాకు దూరంగా ఉన్న ఆమె… ఇటీవలే రుద్రాంగి సినిమాతో అభిమానులను మరోసారి పలకరించింది. అయితే స్పోర్ట్స్ కార్లు అంటే ఈమెకు చాలా మక్కువ. ఈ నేపథ్యంలో ఈ మలయాళ బ్యూటీ కొత్త కారు కొనుగోలు చేసింది. బీఎమ్‌డబ్ల్యూ Z4 M40i స్పోర్ట్స్‌ కారు ఇంటికి తెచ్చుకుంది. ఈ కారు ఖరీదు ఎంత అనే విషయాన్ని ఆమె వెల్లడించకపోయినప్పటికీ… మోడల్ బట్టి దాని విలువ కోట్లలో ఉంటుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ కారుతో దిగిన ఫోటోలతో పాటు కంపెనీ ప్రతినిధుల నుండి డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. దీనితో బీఎమ్‌డబ్ల్యూ స్పోర్ట్స్ మోడల్ కారును సొంతం చేసుకున్న మమతా కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : 12th Fail Movie : చిన్న సినిమా అనుకుంటే భారీ వసూళ్లతో ప్రపంచ స్థాయికి చేరుకుంది

Mamta MohandasYamadonga
Comments (0)
Add Comment