Mammootty: ఫిబ్రవరి 15న మమ్ముట్టి ‘భ్రమయుగం’ !

ఫిబ్రవరి 15న మమ్ముట్టి ‘భ్రమయుగం’ !

Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో భూతకాలం’ ఫేమ్ దర్శకుడు రాహుల్‌ సదాశివన్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘భ్రమయుగం’. నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌, వై నాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో అర్జున్‌ అశోకన్‌, సిద్ధార్థ్‌ భరతన్‌, అమల్దా లిజ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భిన్నమైన హారర్‌ థ్రిల్లర్‌ కథతో పాన్ ఇండియా లెవెల్ లో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ పోస్టర్, మమ్ముట్టి(Mammootty) ఫస్ట్ లుక్, టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో హారర్‌ థ్రిల్లర్‌ గా డార్క్ థీమ్ లో వస్తున్న ఈ సినిమా కోసం మమ్ముట్టి అభిమానులతో పాటు సస్పెన్స్, హరర్ థ్రిల్లర్ సినిమాల అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనితో ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Mammootty Movie Updates

ఇటీవల విడుదలైన ‘కాథల్‌-ది కోర్‌’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో… ఇదే స్పీడ్ లో ‘భ్రమయుగం’ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తేవాలని మమ్ముట్టి డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలోనే వేసవికి విడుదల చేయాలనుకున్న ఈ ‘భ్రమయుగం’ సినిమాను ఫిబ్రవరి 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనితో మమ్ముట్టి అభిమానులతో పాటు హరర్ సినిమాల అభిమానులు ఫిబ్రవరి 15 కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారట. మమ్ముట్టి రీసెంట్ గా ఆయన నటించిన కన్నూర్ స్క్వాడ్, కాథల్ ది కోర్ సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ‘భ్రమయుగం’ పై అంచనాలు రెట్టింపయ్యాయి.

Also Read : Sreela Majumdar: క్యాన్సర్ తో ప్రముఖ హీరోయిన్ మృతి !

Bramayugammammootty
Comments (0)
Add Comment