Mammootty: ఉత్తమ నటుడిగా అవార్డ్‌ స్వీకరిస్తూ భావోద్వేగానికి గురైన మమ్ముట్టి !

ఉత్తమ నటుడిగా అవార్డ్‌ స్వీకరిస్తూ భావోద్వేగానికి గురైన మమ్ముట్టి !

Mammootty: ఫిలింఫేర్‌ (సౌత్‌) 2024 అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌ లో శనివారం రాత్రి జరిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోని సినిమాలకు, నటీనటులకు పురస్కారాలు అందించారు. నాన్పకల్‌ నెరతు మయక్కమ్‌ సినిమాకుగానూ మలయాళ స్టార్‌ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు.

Mammootty Emotional

ఈ పురస్కారాన్ని అందుకుంటున్న సమయంలో మమ్ముట్టి ఎమోషనల్‌ అయ్యాడు. అవార్డు తీసుకుంటున్నందుకు అంత సంతోషంగా ఏమీ లేదన్నాడు. విక్రమ్‌, సిద్దార్థ్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న మమ్ముట్టి… ‘ఇది నా 15వ ఫిలింఫేర్‌ అవార్డ్‌.. ఈ మూవీలో నేను ద్విపాత్రాభినయం చేశాను. తమిళ్‌, మలయాళం మాట్లాడాను. ఈ చిత్రాన్ని నేనే నిర్మించాను. ఈ విజయాన్ని సాధించేందుకు తోడ్పడ్డ టీమ్‌కు కృతజ్ఞతలు.

నిజానికి ఈ క్షణం నేనెంతో సంతోషంగా ఉండాలి. కానీ ఆ ఆనందమే లేకుండా పోయింది. కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరాశ్రులయ్యారు. ఆ ప్రమాదం మనసును కలిచివేస్తోంది. మీరు కూడా బాధితులకు ఎంతో కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను’ అని పిలుపునిచ్చాడు. కాగా మమ్ముట్టి వయనాడ్‌ బాధితుల కోసం కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.20 లక్షల విరాళం ప్రకటించారు.

Also Read : Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’ క్లైమాక్స్ కు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా అనల్‌ అరసు !

68th Filmfare AwardsmammoottyWayanad Landslide
Comments (0)
Add Comment