Mamitha Baiju : ఆ తెలుగు యంగ్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మమిత

మమిత ఓ షార్ట్ ఫిల్మ్‌లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.....

Mamitha Baiju : ప్రేమలు అనే రొమాంటిక్ కామెడీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది మమితా బైజు. మలయాళ పరిశ్రమలో రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ పెద్ద ఎత్తున ఆదరణ పొందింది. కథానాయిక మమితా బైజు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమె ఒక వైద్యుని కుమార్తెగా జన్మించింది. బైజు కృష్ణన్ మరియు మినీ బైజు కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగురులో జన్మించారు. ఆమెకు మిధున్ బైజు అనే అన్నయ్య ఉన్నాడు.

Mamitha Baiju Movies

మమిత ఓ షార్ట్ ఫిల్మ్‌లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు ప్రేమలు సినిమా పెద్ద హిట్ అవ్వడంతో చిన్న సినిమాకి క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. మమితా బైజు తెలుగు యంగ్ హీరో సినిమాలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందే ఈ చిత్రంలో కథానాయికగా మమితాని ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది, త్వరలోనే తాజా సమాచారం వెలువడనుంది.

మమితా బైజు ప్రస్తుతం తమిళంలో ‘రెబల్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ అమ్మడు త్వరలో తెలుగులోకి నేరుగా అరంగేట్రం చేయనుందని పుకార్లు రావడంతో ఈ అమ్మడు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

Also Read : Nagarjuna Akkineni: నాగార్జున సినిమాలో విలన్ గా బాబీ డియోల్ !

Mamitha BaijuTrendingUpdatesViral
Comments (0)
Add Comment