Pradeep Ranganathan : తను తీసింది రెండు సినిమాలే. కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా స్టార్ హీరోగా మారి పోయాడు. అమాయకత్వం, నిజాయితీతో కూడిన నటన తన స్వంతం . అతడు ఎవరో కాదు డ్రాగన్ చిత్రంలో సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రదీప్ రంగనథన్(Pradeep Ranganathan). తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న నటులలో తను కూడా ఒకడు. ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ , దళపతి విజయ్ , సూర్య లాంటి హీరోలకు ధీటుగా ప్రదీప్ రంగనాథన్ అద్బుతంగా నటిస్తున్నాడంటూ ఇప్పటికే ప్రశంసలు కురుస్తున్నాయి.
Pradeep Ranganathan Movie Updates
తను ఒకటి రెండు షార్ట్ ఫిలింస్ తీశాడు. ఆ తర్వాత నేరుగా తనే డైరెక్ట్ చేసి, నటించిన మూవీ లవ్ టుడే. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తాజాగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన డ్రాగన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 10 రోజుల్లోనే 130 కోట్లకు పైగా వసూలు చేసింది. సినీ పండితులను విస్తు పోయేలా చేసింది. ఇదే సమయంలో తనతో అగ్రిమెంట్ చేసుకుంది మైత్రీ మూవీ మేకర్స్. దేశంలోనే అత్యంత పేరు పొందిన సంస్థ ఇది.
డ్రాగన్ ను తమిళంతో పాటు తెలుగులో కూడా తీశారు. విడుదలైన అన్ని చోట్లా భారీ స్పందన వచ్చింది. ఇంకా ఓటీటీ కన్ ఫర్మ్ కాలేదు. దీని కోసం భారీగా పోటీ నెలకొంది.ఈ తరుణంలో మైత్రీ మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. తను లవ్ టుడేలో ఒక హీరోయిన్ తో నటిస్తే, డ్రాగన్ లో ఇద్దరితో జత కట్టాడు. ఇప్పుడు కొత్త చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇందులో మలయాళంకు చెందిన హీరోయిన్ ప్రేమలు ఫేమ్ మమిళా బైజును ఎంపిక చేశారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ధ్రువీకరించారు. మరి మరో ఇద్దరు హీరోయిన్లు ఎవరనేది ఇంకా ప్రకటించ లేదు.
Also Read : Beauty Samantha : నిర్మాతగా మారిన సమంత రుత్ ప్రభు