Malvi Malhotra: రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యపై మాల్వీ మల్హోత్ర సంచలన వ్యాఖ్యలు !

రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యపై మాల్వీ మల్హోత్ర సంచలన వ్యాఖ్యలు !

Malvi Malhotra: హీరో రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్ర డేటింగ్‌లో ఉన్నారంటూ రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య చేసిన వ్యాఖ్యలను హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఖండించారు. లావణ్య తన మీద చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. రాజ్‌తరుణ్‌ హీరోగా తెరకెక్కిన ‘తిరగబడరసామీ’ చిత్రంలో ఆమె కథానాయికగా నటించారు. రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రతో సన్నిహితంగా ఉంటున్నాడంటూ రాజ్ తరుణ్ గత ప్రేయసి లావణ్య శుక్రవారం వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అతని మీద కేసు కూడా పెట్టింది. దీనితో లావణ్యపై ఫైర్ అవుతూ… సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై మాల్వీ మల్హోత్ర కంప్లయింట్ చేశారు.

Malvi Malhotra Comment

ఈ సందర్భంగా మాల్వీ మల్హోత్ర మాట్లాడుతూ… ‘‘నేను బెదిరించానని లావణ్య చెబుతుంది. ఆమెను నేను బెదిరించడం కాదు.. నన్నే ఆమె బెదిరించింది. నా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి లేనిపోనివి చెప్పింది. రాజ్‌ తరుణ్‌ తో నా ఫోటోలన్నీ మేం కలిసి నటించిన సినిమాకు సంబంధించినవే. నాపై ఆరోపణలు చేసిన లావణ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తనపై పరువు నష్టం దావా వేస్తాను’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Also Read : Prabhas Marriage : డార్లింగ్ పెళ్లిపై స్పందించిన పెద్దమ్మ ‘శ్యామలాదేవి’

Malvi MalhotraRaj Tarun
Comments (0)
Add Comment