Anju Kurian : కుర్రాళ్ళ గుండెల్లో గునపం దించిన మలయాళ భామ ‘అంజు కురియన్

కుర్రాళ్ళ గుండెల్లో గునపం దించిన మలయాళ భామ 'అంజు కురియన్..

Anju Kurian : మలయాళీ చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అంజు కురియన్. ఓం శాంతి ఓషాన’ సినిమాలో వినీత్ శ్రీనివాస్ తో కలిసి నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ‘ న్యాన్ ప్రకాశని’లో ఫహద్, ‘జాక్ డేనియల్’లో దిలీప్ సరసన నటించింది. మోడలింగ్ రంగంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటుంది. తాజాగా కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేసింది అంజు కురియన్(Anju Kurian). తన నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెలకు గాయం చేసింది అంజు కురియన్. ” నేను నిన్ను కనుగొన్నాను. ఈ క్షణానికి మనల్ని నడిపించిన ఎన్నో లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు, ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అంటూ రాసుకొచ్చింది.

Anju Kurian Marriage Updates

నవ్వు, ప్రేమతో నిండిన ఈ ప్రయాణం ఒక అద్భుతం అంటూ తన ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు షాకిచ్చింది. దీంతో అంజుకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంజు మోడలింగ్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అంజు కురియన్ 2013లో వచ్చిన ‘నేరమ్’ చిత్రంలో నివిన్ పౌలీకి సోదరి పాత్రలో నటించింది. ఇప్పటివరకు దాదాపు పదిహేను చిత్రాల్లో నటించాడు.

Also Read : Sai Pallavi : బాలీవుడ్ పై లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు

Anju KurianmarriageTrendingUpdatesViral
Comments (0)
Add Comment